వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక రిజల్ట్స్: సోరబ్‌లో మాజీ సీఎం బంగారప్ప కొడుకుల పోటీ, తమ్ముడిపై అన్న విజయం

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని సొరబ్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ముఖ్యమంత్రి తనయులు ఒకే స్థానం నుండి వేర్వేరు పార్టీల నుండి పోటీ చేశారు. అయితే ఈ దఫా జెడి(ఎస్) అభ్యర్ధిగా బరిలో నిలిచిన ఎస్. కుమార బంగారప్ప విజయం సాధించారు. బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన తమ్ముడిని ఓడించాడు.

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప తనయులు ఎస్. కుమార్ బంగారప్ప, మధు బంగారప్పలు. సొరబ్ అసెంబ్లీ స్థానం నుండి వేర్వేరు పార్టీల నుండి ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేశారు.

Karnataka assembly results 2018 live: BJPs S.Kumara Bangarappa Won from sorab segment

కుమార్ బంగారప్ప బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయగా, బిజెపి నుండి మధు బంగారప్ప పోటీ చేశారు. అయితే ఇవాళ వెలువడిన ఫలితాల్లో బిజెపి అభ్యర్ధి ఎస్. కుమార బంగారప్ప విజయం సాధించారు. మధు బంగారప్పపై కుమార్ సుమారు 9 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. మధు రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే 2013లో జరిగిన ఎన్నికల్లో అన్నపై మధు విజయం సాధించారు. 1996, 1999, 2004లలో జరిగిన ఎన్నికల్లో కూడ ఈ స్థానం నుండి కుమార్ విజయం సాధించారు. 2004 ఎన్నికల నుండి వీరిద్దరూ కూడ ఒకే అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. కుమార్ బంగారప్ప గతంలో మంత్రిగా కూడ పనిచేసిన అనుభవం ఉంది.ఈ దఫా తమ్ముడిపై బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసి కుమార్ బంగారప్ప విజయం సాధించారు.

English summary
JD(s) Candidate S. Kumara bangarappa won from Sorab assembly segment in the Shimoga district and Central Karnataka region of Karnataka and is a part of the Shimoga Parliamentary constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X