వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక సీఎం బలపరీక్షకు అన్ని సిద్దం: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే, విదాన సౌధ కార్యదర్శి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక 15వ శాసన సభ సమావేశాలు మే 19వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతాని, సీఎం బలపరీక్షకు అన్ని సిద్దం చేశామని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే అన్ని జరుగుతాయని అసెంబ్లీ కార్యదర్శి ఎస్. మూర్తి అన్నారు. బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. శనివారం ఉధయం 11 గంటలకు శాసన సభ సమావేశాలు జరుగుతాయని ఎమ్మెల్యేలు అందరికీ సమాచారం ఇచ్చి నోటీసులు జారీ చేశామని ఎస్. మూర్తి అన్నారు.

ఎమ్మెల్యేలు అనర్హులు

ఎమ్మెల్యేలు అనర్హులు

మే 17వ తేదీన కర్ణాటక 14వ శాసన సభ పూర్తిగా రద్దు అయ్యిందని ఎస్. మూర్తి వివరించారు. అందువలన ఎమ్మెల్యేలు అందరూ అనర్హులు అయ్యారని, 2018 శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎన్నికల అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్, విదాన సౌధ జారీ చేసిన నోటీసులు తీసుకుని శనివారం ఉదయం విదాన సౌధకు రావాలని సూచించామని ఎస్. మూర్తి మీడియాకు చెప్పారు.

ప్రమాణస్వీకారం

ప్రమాణస్వీకారం

గవర్నర్ వాజుబాయ్ వాలా తాత్కాలిక స్పీకర్ గా కేజీ. బోపయ్యను నియమించారని ఎస్. మూర్తి అన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో తాత్కాలిక స్పీకర్ కేజీ బోపయ్య శనివారం అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తారని ఎస్. మూర్తి వివరించారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు

సుప్రీం కోర్టు ఆదేశాలు

కర్ణాటక శాసన సభ సమావేశాలు నిర్వహించడానికి సుప్రీం కోర్టు మూడు ఆదేశాలు జారీ చేసింది. మొదట తాత్కాలిక స్పీకర్ అసెంబ్లీ సమావేశాన్ని ప్రారంభించాలి. అనంతరం ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించాలి. సాయంత్రం 4 గంటల సమయంలో సీఎం బలపరీక్షనిష్పక్షపాతంగా నిర్వహించాలని తాత్కాలిక స్పీకర్ కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బలపరీక్షకు ఓకే

బలపరీక్షకు ఓకే

సీఎం బీఎస్ యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్. మూర్తి వివరించారు. ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలను ఓ వైపు లెక్కిస్తామని, మరో వైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అసెంబ్లీ కార్యదర్శి ఎస్. మూర్తి వివరించారు.

English summary
Karnataka assembly secretary S.Murthy said preparations have been completed for floor test of chief ministers minister B.S.Yedyurappa and notice has been served to all the MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X