బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు కర్ణాటక బంద్ !, కన్నడిగులకే ఉద్యోగాలు, ప్రైవేట్ రిజర్వేషన్లు, 600 సంఘాల మద్దతు, బెంగళూరులో !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Karnataka Bandh On Feb 13th : Jobs For Kannadigas | What Will Be Open And Shut?

బెంగళూరు: కర్ణాటక బంద్ కు కర్ణాటక సంఘటన ఒక్కూట (కర్ణాటక సంఘాల ఐక్యవేదిక) పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 13వ తేదీ గురువారం కర్ణాటక బంద్ ను విజయవంతం చెయ్యాలని కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. కర్ణాటకలో కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలని, సరోజిని మహిషి వరది (నివేదిక) జారీ చెయ్యాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. కర్ణాటక బంద్ కు 600 సంఘ, సంస్థలు మద్దతు ప్రకటించాయి. అయితే గురువారం జరిగే కర్ణాట బంద్ కు కర్ణాటక రక్షణా వేదికతో పాటు అనేక సంఘాలు మా మద్దతు లేదని స్పష్టం చేశాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కర్ణాటక బంద్ కు తమ మద్దతు ఉంది ? లేదు ? అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

కన్నడిగులకే ఉద్యోగాలు

కన్నడిగులకే ఉద్యోగాలు

కర్ణాటకలో కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలని, సరోజిని మహిషి నివేదిక జారీ చెయ్యాలని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బెంగళూరు నగరంలోని మౌర్య సర్కిల్ లో నిరంతరంగా ధర్నాలు చేస్తున్నారు. కన్నడ సంఘాలు చేస్తున్న ధర్నా ఫిబ్రవరి 13వ తేదీకి 100 రోజులు అవుతోంది. ధర్నాలు మొదలు పెట్టి 100 రోజులు అవుతున్న సందర్బంగా కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చామని కన్నడ సంఘాల ఐక్య వేదిక తెలిపింది.

 కర్ణాటక రక్షణా వేదిక మద్దతు లేదు

కర్ణాటక రక్షణా వేదిక మద్దతు లేదు

ఫిబ్రవరి 13వ తేదీ జరిగే కర్ణాటక బంద్ కు కర్ణాటక రక్షణా వేదిక (నారాయణ గౌడ) వర్గం మద్దతు లేదు. ఈ విషయంపై కర్ణాటక రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ మాట్లాడుతూ 1999 నుంచి సరోజిని మహిషి నివేదిక జారీ చెయ్యాలని తాము పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. అయితే ఇదే విషయంలో ఇప్పుడు కొన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయని అన్నారు. సరోజిని మహిషి నివేదిక జారీ చెయ్యాలనే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని, అయితే ఫిబ్రవరి 13వ తేదీ జరిగే కర్ణాటక బంద్ కు తమ మద్దతు లేదని నారాయణ గౌడ స్పష్టం చేశారు.

హోటల్ సంఘాలు

హోటల్ సంఘాలు

బృహత్ బెంగళూరు హోటల్స్ సంఘం గురువారం జరిగే కర్ణాటక బంద్ కు మద్దతు ఇవ్వడం లేదు. ఫిబ్రవరి 13వ తేదీ జరిగే కర్ణాటక బంద్ కు మా మద్దతు లేదని హోటల్స్ సంఘం అధ్యక్షుడు పీసీ. రావ్ స్పష్టం చేశారు. ప్రజలు, ఆహార ప్రియులకు ఇబ్బందులు కలగకుండా చాడాల్సిన బాధ్యత మామీద ఉందని, అందుకే కర్ణాటక బంద్ కు మద్దతు ఇవ్వడం లేదని పీసీ. రావ్ వివరించారు.

 ఆర్ టీసీ బస్సుల సంచారం ?

ఆర్ టీసీ బస్సుల సంచారం ?

కేఎస్ఆర్ టీసీ, బెంగళూరు నగరంలో సంచరించే బీఎంటీసీ ఉద్యోగులు మాత్రం నైతికంగా కర్ణాటక బంద్ కు మద్దతు ప్రకటించారు. అయితే బస్సుల సంచారం పూర్తిగా తాము నిలిపివెయ్యమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కర్ణాటక బంద్ నిర్వహించే కార్యకర్తలు బస్సుల మీద రాళ్లు రువ్వితే మాత్రం ఆర్ టీసీ బస్సులు నిలిపివేసే అవకాశం ఉందని తెలిసింది.

కర్ణాటక బంద్ కు 600 సంఘాల మద్దతు !

కర్ణాటక బంద్ కు 600 సంఘాల మద్దతు !

ఫిబ్రవరి 13వ తేదీ జరిగే కర్ణాటక బంద్ కు లారీ యజమానుల సంఘం, ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల సంఘం, వీది వ్యాపారుల సంఘం, కోడిహళ్ళి చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని రైతు సంఘాలు, ఆదర్శ ఆటో యూనియన్ సంఘం, పీస్ ఆటో యూనియన్, జై భారత్ డ్రైవర్ల సంఘం, సారధి సేనతో పాటు 600 కన్నడ సంఘ, సంస్థలు కర్ణాటక బంద్ కు మద్దతు ప్రకటించాయి.

బెంగళూరులో ఆటోలు బంద్

బెంగళూరులో ఆటోలు బంద్

ఆదర్శ ఆటో యూనియన్, పీస్ ఆటో యూనియన్ తో పాటు అనేక ఆటో డ్రైవర్ల సంఘాలు ఫిబ్రవరి 13వ తేదీ కర్ణాటక బంద్ కు మద్దతు ప్రకటించడంతో ఆటోలు సంచరించే అవకాశం చాల తక్కువగా ఉంది. అయితే కొన్ని ఆటో డ్రైవర్ల సంఘాలు మాత్రం తాము ఆటోలు తిప్పుతాము అంటున్నారు. అయితే చాల తక్కువ ఆటోలు బెంగళూరులో సంచరించే అవకాశం ఉంది.

బెంగళూరు మెట్రో సంచారం !

బెంగళూరు మెట్రో సంచారం !

ఫిబ్రవరి 13వ తేదీ జరిగే కర్ణాటక బంద్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని నమ్మ మెట్రో (బెంగళూరు మెట్రో) ఉద్యోగులు అంటున్నారు. ఎప్పటిలాగే గురువారం మెట్రో రైలు సంచారం ఉంటుందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తాము చూసుకుంటామని మెట్రో అధికారులు తెలిపారు.

విద్యాసంస్థలు

విద్యాసంస్థలు

కర్ణాటక బంద్ సందర్బంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజ్ లకు ఇప్పటి వరకు సెలవు ప్రకటించలేదు. కర్ణాటక బంద్ సందర్బంగా పరిస్థితిని పూర్తిగా గమనించి విద్యాసంస్థలకు సెలవు ఇచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు, కాలేజ్ లకు సైతం సెలవు ప్రకటించలేదు. పాఠశాలలు, కాలేజ్ లో పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్షలు తాము వాయిదా వెయ్యలేమని సంబంధిత అధికారులు తెలిపారు.

ఓలా. ఉబెర్ వాహనాలు బంద్

ఓలా. ఉబెర్ వాహనాలు బంద్

ఫిబ్రవరి 13వ తేదీ జరిగే కర్ణాటక బంద్ కు ఓలా, ఉబెర్ డ్రైవర్ల సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. బెంగళూరు నగరంలో ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులు పూర్తిగా నిలిపివేస్తామని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. అయితే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంచరించే క్యాబ్ లు మాత్రం నిలిపివెయ్యమని, విమాన ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఓలా, ఉబెర్ డ్రైవర్ సంఘం నాయకులు తెలిపారు. పెట్రోల్ బంక్ యజమానులు బంద్ కు మద్దతు ఇవ్వడం లేదు. అత్యవసర సేవలు అందించే ఆసుపత్రులు, మెడికల్ షాపులు, అంబులెన్స్ వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించమని బంద్ చేస్తున్న సంఘాలు స్పష్టం చేశాయి.

English summary
Bengaluru: Karnataka bandh called by Karnataka Sangatenegala Okkuta on February 13, 2020 demanding reservation for Kannadigas in jobs. What is open what is closed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X