బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక బంద్ ఎఫెక్ట్, బెంగళూరులో రౌడీషీటర్లు అరెస్టు, హౌస్ అరెస్టులు, కన్నడిగులకే 75 శాతం ఉద్యోగాలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలనే డిమాండ్ తో గురువారం చేపట్టిన బంద్ శాంతియుతంగా జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు నగరంలో 180 మంది రౌడీషీటర్లను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 70, 000 వేల ఉబెర్, ఓలా, క్యాబ్ లు, ఆటోలు సంచారం పూర్తిగా నిలిచిపోయిందని ఆ సంస్థల యాజమానులు, డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు తన్వీర్ తెలిపారు. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. బెంగళూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వేకువ జామున నుంచి కన్నడ సంఘాల ప్రతినిధిలను హౌస్ అరెస్టు చేశారు. కన్నడ సంఘాల నాయకులు, కార్యకర్తలు సీఎం యడియూరప్ప నివాసం ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Karnataka Bandh | Jagan Modi 2nd Meet
 బెంగళూరులో రౌడీషీటర్లు

బెంగళూరులో రౌడీషీటర్లు

కర్ణాటక బంద్ సందర్బంగా హింసాత్మాక సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బెంగళూరు నగరంలో గురువారం వేకువ జామున 4 గంటల నుంచి అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ల ఇళ్ల మీద దాడిచేసిన పోలీసులు సుమారు 180 మంది రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్లకు తరలించారు. గతంలో కావేరీ నీటి విషయంతో పాటు అనేక సందర్బాల్లో జరిగిన కర్ణాటక బంద్ సందర్బంగా రౌడీషీటర్లు రెచ్చిపోవడంతో ఇప్పుడు మళ్లీ అలాంటి సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.

 బెంగళూరులో క్యాబ్ సేవలు !

బెంగళూరులో క్యాబ్ సేవలు !

బెంగళూరు నగరంలో ఓలా, ఉబెర్ ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు కర్ణాటక బంద్ కు పూర్తి మద్దతు ప్రకటించారని ఆ సంఘం యజమానులు, డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు తన్వీర్ తెలిపారు. గురువారం సుమారు 70, 000 వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయని, సాయంత్రం 6 గంటల వరకు తాము బంద్ కు మద్దతు ఇస్తామని, తరువాత ఎప్పటిలాగే వాహనాలు సంచరిస్తాయని తన్వీర్ మీడియాకు చెప్పారు.

కన్నడ సంఘాల నేతలు హౌస్ అరెస్టు

కన్నడ సంఘాల నేతలు హౌస్ అరెస్టు

గురువారం జరుగుతున్న కర్ణాటక బంద్ సందర్బంగా ఎలాంటి గొడవలు జరగడానికి అవకాశం ఇవ్వకూడదని పోలీసులు నిర్ణయించారు. కర్ణాటక బంద్ కు మద్దతు తెలుపుతున్న అనేక కన్నడ సంఘాల నాయకులను గురువారం హౌస్ అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని ఆర్ టీ నగర్ లో కర్ణాటక రక్షణా వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టిని హౌస్ అరెస్టు చేశారు. బెంగళూరు నగరంతో పాటు మంగళూరు, మైసూరు, బళ్లారి, దారవాడ, హుబ్బళి, గుల్బర్గ, కోలారు, తుమకూరు, హాసన్, చిక్కమగళూరు, బెళగావి తదితర ప్రాంతాల్లో కన్నడ సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 సీఎం ఇల్లు ముట్టడి !

సీఎం ఇల్లు ముట్టడి !

బెంగళూరు నగరంలోని సీఎం యడియూరప్ప ఇంటిని ముట్టడించడానికి కన్నడ సంఘాల నాయకులు విఫలయత్నం చేశారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ కు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, మా సమస్యలు పరిష్కరిస్తామని సీఎం యడియూరప్ప హామీ ఇవ్వాలని ఆరోపిస్తూ కన్నడ సంఘాలు సీఎం ఇంటిని ముట్టడించడానికి విఫలయత్నం చేశారు. సీఎం యడియూరప్పకు తాము వినతి పత్రం ఇవ్వాలని కన్నడ సంఘాల నాయకులు డిమాండ్ చెయ్యడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

 మెజస్టిక్, ఫ్రీడం పార్క్, టౌన్ హాల్ లో హై అలర్ట్

మెజస్టిక్, ఫ్రీడం పార్క్, టౌన్ హాల్ లో హై అలర్ట్

బెంగళూరు నగరంలోని మెజస్టిక్, సెంట్రల్ రైల్వేస్టేషన్ (సంగోళ్ళి రాయన్న రైల్వేస్టేషన్) నుంచి భారీ ర్యాలీగా ఫ్రీడం పార్క్ మీదుగా టౌన్ హాల్ చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి నిరసన తెలపాలని కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే పోలీసులు ఫ్రీడం పార్క్ వరకే ర్యాలీకి అనుమతి ఇచ్చారు. టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ ఆందోళనకారులను హెచ్చరించారు. ఈ సందర్బంగా మెజస్టిక్, ఫ్రీడం పార్క్, టౌన్ హాల్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరిస్తున్నాయి.

English summary
Karnataka bandh: Pro- Kannada activist Praveen Shetty has been kept under house arrest Sevaral Pro- Kannada groups have called for Karnataka bandh today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X