బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక బంద్ : మంగళూరులో ఆంధ్రా బస్సుపై రాళ్ల దాడి.. అసలేంటీ బంద్..?

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ,ప్రైవేట్ సెక్టార్లలో 75శాతం ఉద్యోగాలు కన్నడిగ యువతకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదికె(KRV) నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. బంద్‌కు 600 సంఘాలు ఇప్పటికే తమ మద్దతును ప్రకటించాయి. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని దాదాపుగా గత 100 రోజుల నుంచి అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే ఆంధ్రా బస్సులను టార్గెట్ చేసి రాళ్ల దాడి చేయడం
బంద్‌ను ఉద్రిక్తంగా మార్చింది.

 తిరుపతి బస్సుపై రాళ్ల దాడి

తిరుపతి బస్సుపై రాళ్ల దాడి

మంగళూరులో కొంతమంది నిరసనకారులు గురువారం ఉదయం 5.30గంటలకు తిరుపతి వెళ్లే బస్సుపై రాళ్ల దాడి చేశారు. ఫరంగిపెటె ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాళ్ల దాడిని వారు ఖండించారు. మరోవైపు బంద్ కారణంగా కర్ణాటక యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. అయితే ప్రభుత్వ,స్కూళ్లు,కాలేజీలు యధావిధిగా నడుస్తాయని,ఎటువంటి సెలవు లేదని విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు. బంద్‌కు పిలుపునిచ్చిన సంస్థలు శాంతియుతంగా నిరసనలు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

Recommended Video

Karnataka Bandh On Feb 13th : Jobs For Kannadigas | What Will Be Open And Shut?
 బంద్‌కు అన్ని సంఘాల మద్దతు..

బంద్‌కు అన్ని సంఘాల మద్దతు..

బంద్‌కు ఆటో యూనియన్స్,క్యాబ్ యూనియన్స్ కూడా మద్దతు తెలపడంతో బెంగళూరులో నేడు రవాణా కూడా స్థంభించిపోయే అవకాశం ఉంది. నేటి బంద్‌కు కార్మిక సంఘాలు,రైతు సంఘాలు,వ్యాపారస్తులు కూడా మద్దతు తెలిపారు. ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్,సెంటర్ ఆఫ్ ఇండియన్ కాంగ్రెస్ కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి.

 బెంగళూరులో మెగా ర్యాలీ..

బెంగళూరులో మెగా ర్యాలీ..

బంద్‌ను నేపథ్యంలో కర్ణాటక రక్షణ వేదికె ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధి ప్రవీణ్ శెట్టి నేత్రుత్వంలో బెంగళూరులో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. అనెకల్ టోల్ గేట్ నుంచి ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం వరకు ర్యాలీ కొనసాగనుంది. సీఎం నివాసానికి చేరుకున్న కర్ణాటక రక్షణ వేదికె ప్రతినిధులు యడియూరప్పకు వినతిపత్రం అందజేయనున్నారు. ఈ గడ్డపై పుట్టిన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నామని,ప్రభుత్వం ఇకనైనా దానిపై దృష్టి సారించాలని ప్రవీణ్ శెట్టి విజ్ఞప్తి చేశారు. మరోవైపు బెంగళూరులో తలపెట్టిన మెగా ర్యాలీకి ఎటువంటి అనుమతులు లేవని బెంగళూరు కమిషనర్ భాస్కర్ రావు తెలిపారు.

అసలేంటీ డిమాండ్...

అసలేంటీ డిమాండ్...

1984లో కర్ణాటక ప్రభుత్వం మాజీ కేంద్రమంత్రి సరోజినీ బిందురావ్ మహిషి నేత్రుత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 1986లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించింది. నివేదికలో 56 సిఫారసులను పేర్కొన్న కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ మరియు కర్ణాటకలోని కేంద్ర ప్రభుత్వ ఇనిస్టిట్యూషన్స్‌లో గ్రూప్-సీ,గ్రూప్-డీ ఉద్యోగాలు 100శాతం కన్నడిగులకే ఇవ్వాలని పేర్కొంది. అలాగే గ్రూప్ ఏ,గ్రూప్ బీ ఉద్యోగాల్లో గరిష్టంగా 80శాతం,కనీసం 60 శాతం ఉద్యోగాలను కన్నడిగులకే ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో అప్పటి కమిటీ ఇచ్చిన రిపోర్టును అమలుచేయడంతో పాటు ప్రైవేట్ సెక్టార్‌లోనూ కన్నడిగులకే 75శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని స్థానిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి యడియూరప్ప నిరసనకారులతో చర్చలు జరిపేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.

English summary
The 6 am-to-6 pm bandh in Karnataka called by some Kannada outfits began on Thursday despite Chief Minister BS Yediyurappa’s appeal to desist from causing any inconvenience to the general public
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X