వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఇయర్‌ వేడుకలపై నిషేధం -కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు -కరోనా భయంతో..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ప్రభావం కొత్త ఏడాదిలోనూ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి భయాల ప్రభావం న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై కూడా పడింది. కరోనా ఉధృతం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సరం వేడులకపై నిషేధం విధించింది.

Bigg Boss 4: కుటుంబాల్లో చిచ్చు -ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు -హోస్ట్‌పై మండిపాటుBigg Boss 4: కుటుంబాల్లో చిచ్చు -ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు -హోస్ట్‌పై మండిపాటు

బెంగళూరు సిటీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధన అమలవుతుందని, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ లాంటి చోట్ల ఎటువంటి ప్రత్యేక వేడుకులను చేపట్టరాదని సర్కారు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నిషేధం డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకూ అమల్లో ఉంటుందని పేర్కొంది.

Karnataka Bans New Year Celebrations To Control COVID-19 Spread

కాగా, పబ్లిక్ ప్లేసులు, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో నిషేధ ఉత్తర్వులుంటాయన్న ప్రభుత్వం.. క్లబ్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లు మాత్రం ఎప్పటిలాగే సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని పేర్కొనడం గమనార్హం. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా, కొత్త సంవత్సరం, క్రిస్మస్ పండుగల్లో ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సామూహిక కార్యక్రమాలను నిషేధించడమైనదని చీఫ్ సెక్రెటరీ పేరిట శుక్రవారం ఆదేశాలు విడుదలయ్యాయి.

పిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్​లో చూసి షాక్​ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతిపిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్​లో చూసి షాక్​ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతి

తొలినాళ్లలో తక్కువ కేసులున్న కర్ణాటకలో రానురాను వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.3కోట్లకుపైగా టెస్టులు నిర్వహించగా, మొత్తం కేసులు 9.05లక్షలు వచ్చాయి. కర్ణాటకలో కరోనా మరణాల సంఖ్య 12వేలుగా ఉంది. ఇప్పటికే 8.78లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 15,205గా ఉంది.

English summary
In a fallout of COVID-19, Karnataka will miss the usual New Year day eve celebrations in clubs, pubs and restaurants among other places with the state government banning special DJ dance programmes and parties for four days from December 30.The government on Thursday issued an order prohibiting such programmes between December 30 and January 2 at clubs, pubs, restaurants and other places where people gather for new year celebrations, citing the prevailing COVID-19 situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X