బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీఆర్ఎల్ బస్సుల్లో రూ.2000 నోట్లు చెల్లవ్: పెద్ద నోట్లు రద్దవుతాయంటూ..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ లాజిస్టిక్, ప్రైవేటు బస్సు ఆపరేటర్ సంస్థ విజయానంద్ రోడ్ లైన్స్ లిమిటెడ్ (వీఆర్ఎల్) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 2000 రూపాయల నోట్లను తీసుకోవద్దంటూ ఓ సర్కులర్ ను జారీ చేసింది. వీఆర్ఎల్ కు సంబంధించినంత వరకూ ఆ సంస్థకు చెందిన లాజిస్టిక్, ప్రైవేటు బస్సు సర్వీసుల్లో 2000 రూపాయల నోట్లు చెల్లవు. త్వరలో ఆ నోట్లు రద్దయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తుండటం వల్లే ఈ సర్కులర్ ను జారీ చేసినట్లు తెలుస్తోంది.

కర్ణాటక కేంద్రంగా..

కర్ణాటక కేంద్రంగా..

కర్ణాటకలోని హుబ్బళ్లి ప్రధాన కేంద్రంగా విజయానంద్ రోడ్ లైన్స్ లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఒక్క లాజిస్టిక్, ప్రైవేటు బస్సుల రవాణాలోనే కాకుండా పలు రంగాల్లో ఆ సంస్థ వేళ్లూనుకుంది. కర్ణాటకలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వీఆర్ఎల్ సంస్థ యాజమాన్యం అగ్రస్థానంలో కొనసాగుతోంది. సరుకుల రవాణా, ప్రైవేటు బస్సులు వందల సంఖ్యలో ఉన్నాయి ఆ సంస్థకు. అలాంటి సంస్థ యాజమాన్యమే 2000 రూపాయలను తీసుకోకవడం చర్చనీయాంశమైంది.

Tollywood: నిర్భయ తల్లితో పూనమ్ కౌర్: ఓ చిన్న ట్రీట్: భుజంపై చేతులు వేసి, ఆప్యాయంగా..!Tollywood: నిర్భయ తల్లితో పూనమ్ కౌర్: ఓ చిన్న ట్రీట్: భుజంపై చేతులు వేసి, ఆప్యాయంగా..!

ఈ ఏడాది చివరిలో గానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ గానీ..

ఈ ఏడాది చివరిలో గానీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ గానీ..


ఈ ఏడాది చివరిలో గానీ లేదా వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి గానీ భారతీయ రిజర్వు బ్యాంకు 2000 రూపాయల నోట్ల చలామణిని రద్దు చేసే అవకాశం ఉందని వీఆర్ఎల్ సంస్థ యాజమాన్యం నిశ్చితాభిప్రాయానికి వచ్చిందని అంటున్నారు. ఈ కారణం వల్లే ఆ పెద్ద నోట్లను తీసుకోవద్దంటూ సర్కులర్ ను జారీ చేసిందని చెబుతున్నారు.

పెద్ద నోట్లు ఉంటే.. బ్యాంకుల్లో జమ చేయాల్సిందే..

పెద్ద నోట్లు ఉంటే.. బ్యాంకుల్లో జమ చేయాల్సిందే..

పెద్ద నోట్లను తీసుకోకపోవడంతో పాటు.. ఇప్పటికే 2000 రూపాయల నోట్లు ఉంటే.. వాటిని వెంటనే బ్యాంకుల్లో జమ చేయాలని ఆదేశించింది. దీన్ని ఖచ్చితంగా పాటించి తీరాలంటూ సర్కులర్ లో ఆదేశించింది. వీఆర్ఎల్ లాజిస్టిక్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ సంకేశ్వర్ పేరు మీద ఈ సర్కులర్ జారీ అయింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన సిబ్బందిపై సంస్థాగతమైన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని సమాచారం.

నిజంగా రద్దు చేస్తారా?

నిజంగా రద్దు చేస్తారా?


2000 రూపాయల నోట్లు భవిష్యత్తులో కనిపించవనే అనుమానాలు చాలాకాలం నుంచే వినిపిస్తూ వస్తున్నాయి. 2000 రూపాయల నోట్ల వల్ల నల్ల డబ్బు భారీగా పేరుకుని పోతోందని, బ్లాక్ మనీని దాచుకోవడానికి ఈ నోట్లు అక్రమార్కులకు మరింత వెసలుబాటును కల్పించినట్టయిందనే అభిప్రాయాలు, వాదనలు ఉన్నాయి. దీనికితోడు- కొంతకాలంగా ఏటీఎంలల్లో ఈ నోట్లు రావట్లేదు. దాని స్థానంలో 500 రూపాయల నోట్ల లావాదేవీలు ఇదివరకటి కంటే కూడా భారీగా పెరిగాయి.

English summary
An internal advisory by a Karnataka-based logistics firm on the possible demonetisation has been making the rounds on social media but its authenticity could not be ascertained immediately. Multiple attempts to reach the firm on the telephone number given on the advisory went in vain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X