బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

US job: మేడమ్ మీరు జీనియస్, అమెరికాలో, నేత్రావతికి నైవేద్యం పెట్టి రూ. 57 లక్షలు నాకేశారు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని, డబ్బుతో పాటు పేరుప్రతిష్టలు సంపాధించుకోవాలని చాలా మంది యువతీ యువకులు ఆశపడుతుంటారు. కరోనా టైమ్ లో ఏదోఒక రకంగా చీటింగ్ చేసి డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేసిన కిలాడీలకు ఓ యువతి లడ్డూలాగా చిక్కింది. మేడమ్ మీరు జీనియస్, మీ తెలివితేటలు సూపర్, అమెరికాలో మీకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఐదు నెలల్లో అక్షరాలా రూ. 57.14 లక్షల రూపాయలు నొక్కేసిన కేటుగాళ్లు నేత్రావతి అనే అమ్మాయికి నైవేద్యం పెట్టేసి చేతులు ఎత్తేశారు.

Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !

 ఉద్యోగం వేటలో నేత్రావతి

ఉద్యోగం వేటలో నేత్రావతి

కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కారవార సమీపంలోని హున్నార తాలుకా గుణవంత ప్రాంతంలో నివాసం ఉంటున్న నేత్రావతి విద్యాభ్యాసం పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగం సంపాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. తెలిసినవాళ్లు, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న స్నేహితుల సహాయంతో విదేశాల్లో ఉద్యోగం సంపాధించుకోవాలని నేత్రవాతి చాలా ప్రయత్నాలు చేసింది.

 హలో మేడమ్ అమెరికా నుంచి మాట్లాడుతున్నాం

హలో మేడమ్ అమెరికా నుంచి మాట్లాడుతున్నాం

నేత్రావతి ఈ మెయిల్ ఐడీకి 2020 ఆగస్టు నెలలో ఒక సమాచారం వెళ్లింది. మీకు అమెరికాలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని నేత్రావతిని నమ్మించారు. అనంతరం ఫోన్ లో మాట్లాడిన కేటుగాళ్లు మేడమ్ మీ వాట్సాప్ నెంబర్ కు ప్రశ్నపత్రం పంపించాము, మీరు ఆన్ లైన్ లోనే పరీక్ష రాస్తే ఉద్యోగం ఇచ్చే విషయం ఆలోచిస్తామని నేత్రావతిని నమ్మించారు.

 మేడమ్ మీరు జీనియస్.... సూపర్..... ఉద్యోగం

మేడమ్ మీరు జీనియస్.... సూపర్..... ఉద్యోగం

ఆన్ లైన్ లో పరీక్ష రాసిన నేత్రావతికి రెండు మూడు రోజుల తరువాత ఫోన్ చేసిన వ్యక్తి మేడమ్ మీరు జీనియస్..... సూపర్, మీకు అమెరికాలో ఉద్యోగం వచ్చేసింది అంటూ నమ్మించాడు. తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చిందని నేత్రావతి మురిసిపోయింది. తన చిరుకాల కోరిక ఫలిస్తోందని, మంచి ఉద్యోగం చేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలని నేత్రావతి కలలు కనింది.

 కరోనా టైమ్ లో హంగామా

కరోనా టైమ్ లో హంగామా

పాస్ పోర్ట్ చార్జ్, వీసా చార్జ్, మెడికల్ రిపోర్టు, అప్లికేషన్ ఫీజు, ఎన్ ఓసీ పీజు, హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు ఇలా అనేక రకాల ఫీజులు చెల్లిస్తే మీరు వెంటనే అమెరికా వెళ్లిపోవచ్చని నేత్రావతికి మాయమాటలు చెప్పారు. వివిద రకాల ఫీజుల పేరుతో 2020 ఆగస్టు 13వ తేదీ నుంచి 2021 జనవరి 17వ తేదీ వరకు కిలాడీలు వివిద బ్యాంకు అకౌంట్ లకు నేత్రావతి నుంచి రూ. 57, 14, 000 డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు.

 నేత్రావతికి నైవేద్యం పెట్టి రూ. 57 లక్షలు నాకేశారు

నేత్రావతికి నైవేద్యం పెట్టి రూ. 57 లక్షలు నాకేశారు

రూ. 57 లక్షలు కేటుగాళ్ల అకౌంట్ లో డిపాజిట్ చేసిన నేత్రావతి అపాయింట్ మెంట్ లెటర్ కోసం వేచి చూసింది. అయితే నేత్రావతికి నైవేద్యం పెట్టి రూ. 57 లక్షలు లూటీ చేసిన సైబర్ కేటుగాళ్లు తరువాత వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి చేతులు ఎత్తేశారు. ఎన్ని రోజులైనా అమెరికా కంపెనీ నుంచి అపాయింట్ మెంట్ లెటర్ రాకపోవడంతో మోసం జరిగిందని గుర్తించిన నేత్రావతి సైబర్ పోలీసులను ఆశ్రయించింది. కరోనా టైమ్ లో కరెక్ట్ స్కెచ్ వేసి నేత్రావతిని నిలువునా మోసం చేసిన సైబర్ నేరస్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
US job: Karnataka based women cheated offering job in America. Women paid Rs. 57 lakh Rs from past five months. Complaint filed in Karwar police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X