వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు కర్ణాటక, నేడు మహారాష్ట్ర.. రాజకీయాలకు ఆ హోటలే బంగారు బాతుగుడ్డు, ఎమ్మెల్యేలు, చీమ కూడా!

|
Google Oneindia TeluguNews

ముంబై/బెంగళూరు: మహారాష్ట్ర రాజకీయాలకు, కర్ణాటక రాజకీయాలకు ముడిపెడుతున్న ముంబైలోని రెనైసెన్స్ పొవాయ్ హోటల్ నేడు హాట్ టాఫిక్ అయ్యింది. కొన్ని నెలల క్రితం కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుని రెనైసెన్స్ పొవాయ్ హోటల్ లో మకాం వేశారు. ఇప్పుడు అదే మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలు రెనైసెన్స్ పొవాయ్ హోటల్ లో మకాం వేశారు. ఆ రోజు రెనైసెన్స్ పొవాయ్ హోటల్ నుంచి కర్ణాటక రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ నేతలు ఈ రోజు మళ్లీ అదే రెనైసెన్స్ పొవాయ్ హోటల్ నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తోందని, అయితే వారి వ్యూహాలు ఇప్పుడు ఫలించవని ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ అంటున్నారు. రెనైసెన్స్ హోటల్ ల్లోకి చీమ కూడా దూరకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు.

డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!

బంగారు బాతుగుడ్డు

బంగారు బాతుగుడ్డు

కొన్ని నెలల క్రితం కర్ణాటక రాజకీయాల సంక్షోభానికి చెక్ పెట్టడానికి రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుని రెనైసెన్స్ పొవాయ్ హోటల్ లో మకాం వేశారు. రెబల్ ఎమ్మెల్యేలను కలవడానికి బెంగళూరు నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ముంబై చేరుకుని రెనైసెన్స్ పొవాయ్ హోటల్ దగ్గరకు చేరుకున్నారు. అయితే డీకే. శివకుమార్ ను హోటల్ లోకి వెళ్లకుండా బీజేపీ నాయకులు పక్కాప్లాన్ తో ఆయన్ను కట్టడి చేశారు. ఆ రోజు రెబల్ ఎమ్మెల్యేలకు రెనైసెన్స్ హోటల్ బంగారు బాతుగుడ్డులా చిక్కింది.

పోలీసు కమిషనర్ ఎంట్రీ

పోలీసు కమిషనర్ ఎంట్రీ

ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ మమ్మల్ని కలవడానికి వీళ్లేదని, వారి నుంచి తమకు ముప్పు ఉందని, మాకు భద్రత కల్పించాలని అప్పట్లో రెబల్ ఎమ్మెల్యేలు ముంబై పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. అప్పటి కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఉండటం, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉండటంతో పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. ముంబై అదనపు పోలీసు కమిషనర్ దిలీప్ సావంత్ తో పాటు, డీసీపీలు, మహారాష్ట్ర రిజర్వు పోలీసులు రెనైసెన్స్ పొవాయ్ హోటల్ ముందు మకాం వేసి డీకే. శివకుమార్ తో పాటు ఎవ్వరూ హోటల్ లోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ రోజు అదే సీన్ రిపీట్

ఈ రోజు అదే సీన్ రిపీట్

ముంబైలోని రెనైసెన్స్ పొవాయ్ హోటల్ లోనే కొందరు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఆ రోజు కర్ణాటక రాజకీయాల్లో రెనైసెన్స్ పొవాయ్ హోటల్ నుంచి ఎలా చక్రం తిప్పామో ఈ రోజు అలాగే చక్రం తిప్పాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

పక్కాప్లాన్ ప్లాప్ అయితే ?

పక్కాప్లాన్ ప్లాప్ అయితే ?

కర్ణాటక రాజకీయాల్లో ఆ రోజు రెనైసెన్స్ హోటల్ నుంచి చక్రం తిప్పిన బీజేపీ నాయకులు ఈ రోజు మాత్రం ఇదే హోటల్ నుంచి చక్రం తిప్పాలని చూస్తున్నారని, అయితే ఇప్పుడు మాత్రం వారు విజయం సాధించలేరని, న్యాయం మా వైపు ఉందని ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ ధీమాగా అంటున్నారు. అయితే మా ప్లాన్ లు మాకు ఉంటాయని, మీ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు.

చీమకూడ దూరలేదు

చీమకూడ దూరలేదు

ముంబైలోని నెరైసెన్స్ పొవాయ్ హోటల్ చుట్టూ పోలీసులు మొహరిస్తున్నారు. చీమ కూడా లోపలికి వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బలనిరూపణలో మెజారిటీ ఎమ్మెల్యే మద్దతు సంపాధించే వరకు ఎమ్మెల్యేలు జారిపోకుండా వారిని కాపాడుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద కొన్ని నెలల క్రితం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన ముంబైలోని స్టార్ హోటల్ రెనైసెన్స్ పొవాయ్ హోటల్ మరోసారి ఇప్పుడు మీడియాలో హాట్ టాఫిక్ అయ్యింది.

English summary
Mumbai: Karnataka BJP govt was dethroned from Renaissance hotel, now it's time for Maharashtra: NCP leader Nawab Malik tweets coincidence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X