బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ లీడర్ కు ఆదాయపన్ను శాఖ షాక్, బెంగళూరు, హుబ్బళి, గోవాలో సోదాలు, లెక్కలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/గోవా: కర్ణాటక బీజేపీ నాయకుడికి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు ఝలక్ ఇచ్చారు. బీజేపీ నేత రవి దండిన నివాసం, విద్యా సంస్థలు, హోటల్స్ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళి, గదగ్, గావోలోని రవి దండినకి చెందిన ఆస్తుల మీద దాడి చేసిన ఐటీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

మహారాష్ట్రలో 2014 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చెప్పింది ఏమిటి? జరిగింది ఏమిటి?మహారాష్ట్రలో 2014 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చెప్పింది ఏమిటి? జరిగింది ఏమిటి?

కర్ణాటకలోని గదగ్ లోని విద్యానగర్ లోని కనకదాస శిక్షణా సంస్థ (కేఎస్ఎస్) కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని బీజేపీ నాయకుడు రవి దండిన విద్యాసంస్థల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. కనకదాస విద్యాసంస్థల కార్యదర్శి రవి దండిన.

Karnataka BJP leader Ravi Dandinas house and hotel have been raided by IT officials.

బెంగళూరు, గదగ్, హుబ్బళి, గోవాలో ఏక కాలంలో 10 చోట్ల రవి దండినకి చెందిన నివాసాలు, విద్యాసంస్థలు, హోటల్స్ మీద దాడులు చేసి వివరాలు సేకరించారు. బీజేపీ నాయకుడు రవి దండిన ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని ఆరోపణలు ఉన్నాయి.

మహిళ ప్రాణం తీసిన సోషల్ మీడియా పిచ్చి,స్నేహితుడు పాట పాడలేదని, భర్త, పిల్లలు !మహిళ ప్రాణం తీసిన సోషల్ మీడియా పిచ్చి,స్నేహితుడు పాట పాడలేదని, భర్త, పిల్లలు !

బీజేపీ నాయకుడు రవి దండిన ఆదాయానికి మించి ఎక్కువ ఆస్తులు సంపాధించి ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు రవి దండిన నివాసాలు, శిక్షణా సంస్థలు, హోటల్స్ మీద దాడులు చేసి అనేక విలువైన పత్రాలు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారని తెలిసింది.

English summary
Bengaluru: Kanakadasa Institute of Education secretary and the BJP leader Ravi Dandina's house and hotel have been raided by IT officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X