మైండ్ బ్లాక్, సీఎం కొడుకు మీద కేసు, మోదీ, అమిత్ షాతో గేమ్స్ ఆడితే అంతే కథ, టైమ్ చూసి!
దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అదే సమయంలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో పలు పార్టీల నాయకులు వారికి అనుకూల వ్యతిరేక చర్చలు, ప్రసంగాలు వినిపిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌పై బీజేపీ, బీజేపీపై కాంగ్రెస్ పార్టీలు ఆరోపణల దాడి చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలపై బహిరంగంగా దూషించిన సీఎం కొడుకు మీద ఫిర్యాదు చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్య అనుచిత పదజాలంతో బీజేపీ నేతల మీద విరుచుకుపడుతున్నారు. దీంతో పాటు యతీంద్ర సిద్ధరామయ్యపై కూడా ఫిర్యాదు చేశారు. యతీంద్ర సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి అమిత్ షాను దూషించడం ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర శాఖ కర్ణాటకలోని వరుణ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే, సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యపై ఆరోపణలు చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం యతీంద్ర సిద్ధరామయ్య మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇది మా నాయకులపై వ్యక్తిగత దాడి అని, యతీంద్ర సిద్ధరామయ్య ప్రధాని మోదీ, అమిత్ షాలను నోటికి వచ్చినట్లు దూషించారని ఆరోపణలు చేశారని బీజేపీ ఆరోపించింది.
ఇది ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై వ్యక్తిగత దాడి అని బీజేపీ ఆ లేఖలో పేర్కొంది. ఇటీవల చామరాజనగర్ జిల్లా హనూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రసంగించిన యతీంద్ర సిద్ధరామయ్య, హోం మంత్రి అమిత్ షా ఒక గూండా, రౌడీ అని, గుజరాత్‌లో నరమేధానికి ఆయన పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి అమిత్ షాను ముందు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలు చేశారన్నారని యతీంద్ర ఆరోపించారు.
సీఎం సిద్దరామయ్య కొడుకు యతీంద్ర విమర్శలను కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సహా పలువురు బీజేపీ నాయకులు ఖండించారు. ఇలాంటి ఆరోపణలు చేసిన యతీంద్రపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. మా పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గురించి యతీంద్ర సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని, ఇది అత్యంత నీచమైన రాజకీయం అని బీజేపీ ఆరోపించింది.
మాజీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్న యతీంద్ర కనీసం పరువు కూడా మర్చిపోయినట్లున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మైసూర్‌తోపాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటమి ఖచ్చితంగా ఉంటుందని, ఓడిపోతామనే భయం, నిరాశతో సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర అవమానకరమైన పదాలను ఉపయోగించి దేశ హోంమంత్రి అమిత్ షా పై చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు ఆరోపించారు.
-
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications