• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video:బీజేపీ మంత్రి సెక్స్ వీడియో -కర్ణాటకలో పెను సంచలనం -ఉద్యోగం పేరుతో మహిళను..

|

రాజ్యాంగం సాక్షిగా రాగద్వేషాలు, అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశారాయన. ప్రజలకు రక్షకుడిగా, వారి సంక్షేమాభివృద్ధికి సంబంధించిన చట్టాలను చేసే హోదా కలిగిన మంత్రి కూడా. జనం ఒక పార్టీ నుంచి గెలిపిస్తే.. ఇంకో పార్టీలోకి జంప్ అయిన జిలానీగానూ గొప్ప పేరున్న ఆయన.. అత్యంత నీచానికి ఒడిగట్టాడిప్పుడు. అవును, మనం మాట్లాడుతున్నది కర్ణాటక బీజేపీ మంత్రి రమేశ్ జర్కిహోలి గురించే..

మంత్రి రాసలీలలు..

మంత్రి రాసలీలలు..

పదవీబాధ్యతలు, ప్రమాణాలు, విధి నిర్వహణ.. అన్నీ మర్చిపోయిన సదరు మంత్రి.. ఉపాధి కల్పించాలంటూ అభ్యర్థించిన ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె జీవితంతో ఆటలాడుకున్నారు. రాసలీలలు సాగిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోలి సెక్స్ స్కాండల్ వ్యవహారం ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుండగా, సదరు సెక్స్ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే..

సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో...

సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో...

బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త దినేశ్ కుళ్లహళ్లి ఫిర్యాదుతో మంత్రి రమేశ్ రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. కార్యకర్త దినేశ్.. మంగళవారం బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ను కలిసి.. మంత్రి చీకటి వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అమాత్యుడి రాసలీలలకు సంబంధించిన వీడియో సీడీలను సాక్ష్యాలుగా సమర్పించి, చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్.. సదరు ఘటన జరిగిన ప్రాంతంలోని పోలీస్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. సామాజిక కార్యకర్త దినేశ్ తెలిపిన వివరాల ప్రకారం..

విద్యుత్ సంస్థలో ఉద్యోగం ఇస్తానని..

విద్యుత్ సంస్థలో ఉద్యోగం ఇస్తానని..

చదువు పూర్తిచేసి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఓ మహిళ(25 ఏళ్లు).. తనకేదైనా ఉపాధి చూపించాలంటూ కొద్దిరోజుల కిందట కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోలికి విన్నవించుకుంది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్న మంత్రి.. ఆమెను లోబర్చుకుని, బలవంతానికి పాల్పడ్డారు. కర్ణాటక పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ (KPTC)లో ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చిన మంత్రిగారు.. బాధిత మహిళను తరచూ బలవంతపెడుతూ కోరిక తీర్చుకునేవాడు. ఒక దశలో..

బాధితురాలికి బెదిరింపులు..

బాధితురాలికి బెదిరింపులు..

ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇవ్వకపోగా, రోజురోజుకూ లైంగిక దాడి, వేధింపులు పెరుగుతోన్న క్రమంలో బాధిత మహిళ మంత్రి రాసలీలల్ని రహస్యంగా చిత్రీకరించింది. ఆమెతో ఏకాతంగా గడుపుతోన్న సమయంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీయూ బడా నేతల పేర్లను ప్రస్తావిస్తూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. సెక్స్ వీడియోలో మంత్రి చేష్టలు స్పష్టంగా రికార్డయ్యాయి. కాగా, బాధిత మహిళ వీడియో తీసిందన్న విషయం తెలిశాక మంత్రి రమేశ్ ఆమెను బెదిరించాడని, ప్రస్తుతం ఆమెతోపాటు ఆమె కుటుంబీకులకు ప్రాణహాని ఉందని, మొత్తం సెక్స్ స్కాండల్ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని సామాజిక కార్యకర్త దినేశ్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై..

 రాసలీలల మంత్రి మామూలోడు కాదు..

రాసలీలల మంత్రి మామూలోడు కాదు..

ఉద్యోగం పేరుతో మహిళను లోబర్చుకుని వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన మంత్రి, బీజేపీ నేత రమేశ్ జర్కిహోలి సాదాసీదా నాయకుడేమీ కాదు.. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీయూ సర్కారును పడగొట్టి, బీజేపీని అధికారంలోకి తేవడంలో ఆయన విశేష పాత్ర పోషించారు. అందుకు ప్రతిఫలంగానే కేబినెట్ లో ఆయనకు చోటు దక్కింది. కాగా, మంత్రి సెక్స్ స్కాండల్ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఆ వీడియో.. కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ లో చిత్రీకరించినట్లు తెలియడంలో, ఆ స్టేషన్ లోనే కేసు నమోదు చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English summary
Social activist Dinesh Kallahalli on Tuesday approached the city police commissioner Kamal Pant and demanded a detailed probe into an alleged sex scandal involving BJP leader Ramesh Jarkiholi, who is also Minister of Water Resources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X