వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరులో భేటీ: థర్డ్ ఫ్రెంట్ అంటే పుట్టగొడుగులతో సమానం: బళ్లారి శ్రీరాములు, రాజీనామా!

|
Google Oneindia TeluguNews

బళ్లారి/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి దేశంలోని వివిద ప్రాంతీయ పార్టీల నాయకులు హాజరైన విషయం తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ కు పోటీగా థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు చెయ్యాలని బెంగళూరులో పలు పార్టీల నాయకులు చర్చలు జరిపారు. ఈ విషయంపై కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు స్పంధించారు. థర్డ్ ఫ్రెంట్ అంటే వర్షాకాలంలో వచ్చే పుట్టగొడుగులతో సమానం అని శ్రీరాములు వ్యంగంగా అన్నారు.

భవిష్యత్తు లేదు

భవిష్యత్తు లేదు

బళ్లారిలో గురువారం విలేకరులతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములు థర్డ్ ఫ్రంట్ కు భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. ఎన్నిపార్టీల నాయకులు కలిసి థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు చేసినా దానిని ముందుకు నడిపించడంలో విఫలం అవుతారని, ఎవరికి వారే నాయకులు అవుతారని శ్రీరాములు వ్యంగంగా అన్నారు.

కాంగ్రెస్ పక్కా విరోధి

కాంగ్రెస్ పక్కా విరోధి

థర్డ్ ఫ్రెంట్ కు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి భద్ద విరోధి అని బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటుకు ఎలా సహకరిస్తుందని శ్రీరాములు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు ఇంత వరకూ ఎవ్వరూ బాగుపడలేదని, థర్డ్ ఫ్రెంట్ నాయకుల పరిస్థితి అదే అని శ్రీరాములు వ్యంగంగా అన్నారు.

థర్డ్ ఫ్రెంట్ అంటే పుట్టగొడుగులు

థర్డ్ ఫ్రెంట్ అంటే పుట్టగొడుగులు

వర్షాకాలంలో పుట్టగొడులు ఎక్కువగా వస్తాయని, వర్షాకాలం పూర్తి అయిన తరువాత పుట్టగొడుగుటు భూమి మీద కనపడవని బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు అన్నారు. థర్డ్ ఫ్రెంట్ కూడా అంతేనని శ్రీరాములు ఎద్దేవ చేశారు. ఎన్నికల సమయంలో థర్డ్ ఫ్రెంట్ వస్తోందని, ఎన్నికల పూర్తి అయిన తరువాత మాయం అవుతోందని శ్రీరాములు గుర్తు చేశారు.

సీఎం రాజీనామ

సీఎం రాజీనామ

మెజారిటీ ఎమ్మెల్యేలతో అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు కుమారస్వామి హామీ ఇచ్చారని శ్రీరాములు గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కుమారస్వామి రైతురుణాల మాఫీ విషయంలో యూటర్న్ తీసుకున్నారని శ్రీరాములు విమర్శించారు. మెజారిటీ లేదని సీఎం కుమారస్వామి భావిస్తే ఆయన పదవికి రాజీనామా చెయ్యాలని శ్రీరాములు డిమాండ్ చేశారు.

భాదగానే ఉంది

భాదగానే ఉంది

బళ్లారి జిల్లాలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోలేకపోయినందుకు చాల భాదగానే ఉందని శ్రీరాములు అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని, కుమారస్వామి ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని, వారిని వెంటాడి ప్రజా సమస్యలపై పోరాడుతామని శ్రీరాములు హెచ్చరించారు.

English summary
BJP MLA Sriramulu said third front only seen when elections were near. He said third front is like mushrooms of rain season. it has no identity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X