బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హనీట్రాప్ లో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, రూ. 50 కోట్లకు డీల్, బ్లాక్ మెయిల్,వైరల్ వీడియోలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని గదగ్ జిల్లా పరాధిలోని బీజేపీ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాసలీలల వీడియోలు వైరల్ కావడంతో సీసీబీ పోలీసులు రంగంలోకి దిగి అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే హనీట్రాప్ కేసులకు సంబంధించి 8 మందిని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మరి కొందరి కోసం గాలిస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు. హనీట్రాప్ లో చిక్కుకున్న మాజీ మంత్రిని ఏకంగా రూ. 50 కోట్లు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చెయ్యడం, విసిగిపోయిన మాజీ మంత్రి నిందితులను హత్య చెయ్యడానికి సుపారి (కిరాయి) ఇవ్వడం, తరువాత రాసలీలల వీడియోలోని అమ్మాయి రూ. 10 కోట్లకు డీల్ మాట్లాడటం జరిగిందని విచారణ చేస్తున్న సీసీబీ పోలీసులు తెలిపారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

నలుగురు కింగ్ పిన్స్

నలుగురు కింగ్ పిన్స్

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు హనీట్రాప్ గాలం వేసిన కేసులో ప్రధాన నిందితుడు రాఘవేంద్ర అలియాస్ రఘ, అతని ప్రియురాలు పుష్పా, మంజునాథ్, అతని ప్రియురాలు పుష్పావతి అనే నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశామని సీసీబీ విభాగం డీసీపీ. కేపీ. రవికుమార్ తెలిపారు. తప్పించుకుని తిరుగుతున్న మరి కొందరి కోసం గాలిస్తున్నామని సీసీబీ విభాగం డీసీసీ కేపీ. రవికుమార్ నేతృత్వంలో కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.

 ఎమ్మెల్యేలు, శ్రీమంతులతో లింక్ !

ఎమ్మెల్యేలు, శ్రీమంతులతో లింక్ !

కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన రాఘవేంద్ర అలియాస్ రఘు మొదట మొబైల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తరువాత బెంగళూరు నగరంలోని పరప్పన అగ్రహార ప్రాంతంలో తల్లితో కలిసి రాఘవేంద్ర నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం నిలిపివేసిన రాఘవేంద్ర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రీమంతులతో పరిచయం పెంచుకోవడం మొదలు పెట్టాడు.

రాజకీయ నాయకులు, శ్రీమంతులతో పరిచయం పెంచుకున్న తరువాత వారికి మాయమాటలు చెప్పాడు.

 కాలేజ్ అమ్మాయిల ముసుగులో !

కాలేజ్ అమ్మాయిల ముసుగులో !

రాఘవేంద్ర తన ప్రియురాలు పుష్పతో పాటు కొందరు అందమైన అమ్మాయిలను ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల దగ్గరకు తీసుకెళ్లి వారికి పరిచయం చేశాడు. నేటి రాజకీయాల గురించి కాలేజ్ అమ్మాయిలు ప్రాజెక్టు వర్క్ చెయ్యడానికి వచ్చారని, వారికి మీరు సహకరించాలని రాఘవేంద్ర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు మాయమాటలు చెప్పాడు.

మంచి చాన్స్ అంటూ ఎమ్మెల్యేలు !

మంచి చాన్స్ అంటూ ఎమ్మెల్యేలు !

రాఘవేంద్ర ప్రియురాలు పుష్పతో పాటు అమ్మాయిలతో పరిచయం పెంచుకున్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వారికి తమ మొబైల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి తరువాత వారి ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఇలా కొన్ని సార్లు అమ్మాయిలతో ఎమ్మెల్యేలు రహస్యంగా కావలసిన రీతితో మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యేలు, అమ్మాయిలు ప్రైవేటుగా మాట్లాడుకున్న సమయంలో నిందితుడు రాఘవేంద్ర ఆ ఆడియోలు రికార్డు చేసుకున్నాడు.

 ఎమ్మెల్యేల పేరుతో రూం బుక్

ఎమ్మెల్యేల పేరుతో రూం బుక్

ఎమ్మెల్యేలు, అమ్మాయిలు చాల దగ్గర అయిన తరువాత రాఘవేంద్ర తాను ఎమ్మెల్యే మాట్లాడుతున్నానని, మీ హోటల్ లో రూం బుక్ చెయ్యాలని అపద్దం చెప్పి గదులు బుక్ చేశాడు. తరువాత బుక్ చేసిన హోటల్ గదుల్లో ముందుగానే స్పై కెమెరాలు ఏర్పాటు చేసిన రాఘవేంద్ర తరువాత ఎమ్మెల్యేలు, అమ్మాయిలు గదిలోకి వెళ్లిన తరువాత జరిగిన తతంగం మొత్తం, రాసలీలలను రహస్యంగా వాటిని వీడియో రికార్డు చేశాడు.

 బీజేపీ ఎమ్మెల్యే వీడియో వైరల్

బీజేపీ ఎమ్మెల్యే వీడియో వైరల్

గదగ్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే హోటల్ గదిలో అర్డనగ్నంగా అమ్మాయి నడుం పట్టుకుని రాసలీలలు సాగిస్తున్న సమయంలో తీసిన వీడియో బయటకు రావడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఇదే సమయంలో ఓ మాజీ మంత్రి రాసలీలల వీడియో లీక్ అయ్యింది. రెండు వీడియోలు వైరల్ కావడంతో రాజకీయ నాయకులతో సహ వారి అనుచరులు షాక్ కు గురైనారు.

పరువు పోయిందని ఆవేదనతో మాజీ మంత్రి, ఓ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

 కాలేజ్ అమ్మాయిలు ఏం చేస్తారు ?

కాలేజ్ అమ్మాయిలు ఏం చేస్తారు ?

తనతో రాసలీలలు సాగిస్తున్నది కాలేజ్ అమ్మాయిలే కదా ? ఎలాంటి సమస్య ఉండదులే ? అంటూ ఓ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రెచ్చిపోయారని తెలిసింది. ఆ సమయంలో అమ్మాయిలతో అసభ్యంగా, చెప్పలేని విధంగా ఏకాంతంగా గడుపుతున్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి రాసలీలల వీడియోలను రాఘవేంద్ర రహస్యంగా చిత్రీకరించాడు. తరువాత రాఘవేంద్ర ఆ వీడియోలు వారికి చూపించి బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు.

 రూ. 50 కోట్లకు డీల్, హత్యకు మాజీ మంత్రి కుట్ర !

రూ. 50 కోట్లకు డీల్, హత్యకు మాజీ మంత్రి కుట్ర !

రాసలీలల వీడియో చూపించిన రాఘవేంద్ర తనకు రూ. 50 కోట్లు ఇవ్వాలని, లేదంటే ఈ వీడియో మీడియాకు విడుదల చేస్తానని రాఘవేంద్ర మాజీ మంత్రిని బ్లాక్ మెయిల్ చేశాడు. రూ. 50 కోట్లు ఇవ్వడానికి మాజీ మంత్రి నిరాకరించాడు. తరువాత రాఘవేంద్ర టార్చర్ ఎక్కువ కావడంతో అతన్ని వీడియోలోని అమ్మాయిని చంపేయాలని మాజీ మంత్రి కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకున్నాడని సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తరువాత వీడియోలోని యువతి తాను రాఘవేంద్రతో మాట్లాడుతానని మాజీ మంత్రిని నమ్మించి రూ. 10 కోట్లకు డీల్ మాట్లాడిందని సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
రూ. కోట్లు సంపాధించిన కింగ్ పిన్

రూ. కోట్లు సంపాధించిన కింగ్ పిన్

ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, శ్రీమంతుల రాసలీలల వీడియోలు రహస్యంగా చిత్రీకరించిన రాఘవేంద్ర కోట్ల రూపాయలు సంపాధించాడు. ముఖ్యంగా తమ పరువు పోతుందని ఆందోళనతో డబ్బులు ఇవ్వడానికి సిద్దం అయిన రాజకీయ నాయకులు, శ్రీమంతులను రాఘవేంద్ర మరింత ఎక్కువగా బ్లాక్ మెయిల్ చేశాడని సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. హనీట్రాప్ కేసులో అరెస్టు అయిన ఇద్దరు యువతుల్లో ఒకరు సినీ పరిశ్రమలో మేకప్ చేస్తున్నారని, మరో యువతి నటి అని పోలీసులు తెలిపారు. రాఘవేంద్ర ఇంటిలో సోదాలు చేసి పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు, సీక్రెట్ కెమెరాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు.

English summary
Karnataka MLAs fell into honey trap. CCB police investigating the case, many interesting information getting out from investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X