వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఐఎ జ్యూవెలర్స్ రూ. 400 కోట్ల చీటింగ్: సీబీ దర్యాపు, విదేశాలకు జంప్: బీజేపీ డిమాండ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని శివాజీనగరంలో దాదాపు రూ. 400 కోట్లకు పైగా ప్రజలకు మోసం చేసి జెండా ఎత్తేసిన ప్రముఖ జ్యువెలరీ షోరూం యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల నుంచి రూ 400 కోట్లకు పైగా డిపాజిట్లు వసూలు చేసి విదేశాలకు పారిపోయిన ఐఎంఎ జ్యువెలర్స్ యజమానిని భారత్ కు రప్పించాలని బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ లేఖ రాశారు.

బెంగళూరులోని శివాజీనగరలో ఎఎంఎ జ్యువెలర్స్ షోరూం నిర్వహిస్తున్నారు. ప్రతి నెల ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసి సంవత్సరం నుంచి బంగారు నగలు ఇస్తామని ప్రజలను సంస్థ మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఎఎంఎకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు ఇచ్చిన యాజమాని మన్సూర్ ఖాన్ చాకచక్యంగా కుటుంబ సభ్యులతో విదేశాలకు పారిపోయాడు.

తనకు పలువురు రాజకీయ నాయకులు మోసం చేశారని, లంచాల రూపంలో వందల కోట్ల రూపాయలు తీసుకున్నారని మన్సూర్ ఖాన్ విడుదల చేసిన ఒక ఆడియో వైరల్ అయ్యింది. మన్సూర్ ఖాన్ కు సహకరించిన వారి వ్యవహారం బయటకు రావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని, ఈడీని, ఐటీ అధికారులను రంగంలోకి దింపాలని బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

Karnataka BJP requests central government to look into IMA jeweler fraud case

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు ఎంఐఎ చీటింగ్ కేసుతో సంబంధం ఉందని స్వయంగా ఆ సంస్థ యజమాని మన్సూర్ ఖాన్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు జేడీఎస్ నాయకులు మన్సూర్ ఖాన్ కు సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

శివాజీనగరలోని ఎంఐఎం జ్యువెలర్స్ సంస్థ ముందు వేల మంది భాదితులు ధర్నా చేస్తున్నారు. తాము కష్టపడిన డబ్బుతో మన్సూర్ ఖాన్ విదేశాలకు పారిపోయారని, అతనికి సహాయం చేసిన రాజకీయ నాయకులను అరెస్టు చెయ్యాలని ధర్నా చేస్తున్నారు. అయితే ఎంఐఎం జ్యువెలర్స్ చీటింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి రోషన్ బేగ్ ఢిల్లీలో వివరణ ఇచ్చారు.

తనను రాజకీయ నాయకులు మోసం చేశారని, తాను ఆత్మహత్య చేసుకుంటానని ఎంఐఎ జ్యువెలర్స్ మన్సూర్ ఖాన్ ఓ వీడియో విడుదల చేశారు. మన్సూర్ ఆలీ కోసం నాలుగు ప్రత్యేక టీంలతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Karnataka BJP requests central government to look into IMA jeweler fraud case. It requested to do CBI, ED, IT investigation about the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X