బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీలో వైఎస్ జగన్ ఫార్ములా రివర్స్, రాజీనామా చేస్తాం, సీనియర్లు వార్నింగ్, కార్లు వెనక్కి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో మొదటి విడత మంత్రివర్గ విస్తరణ తరువాత బీజేపీలోని సీనియర్లు అసహనం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఫ్మార్ములాను ఫాలో అయిన బీజేపీ నాయకులు మూడు వేర్వేరు కులాల నాయకులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఉప ముఖ్యమంత్రి పదవుల విషయంలో మండిపడిన సీనియర్లు వారి మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని పరోక్షంగా సీఎం యడియూరప్పను హెచ్చరించి ప్రభుత్వ కార్లు వెనక్కి పంపిస్తున్నారు.

క్యూలో సీనియర్లు

క్యూలో సీనియర్లు

కర్ణాటక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్లు చాల మంది ఉన్నారు. అయితే సీనియర్లను పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్ తెర మీదకు కొత్త వ్యక్తులను తీసుకువచ్చింది. హైకమాండ్ అనుకున్నట్లే గోవింద కారజోళ, లక్ష్మణ సవది, డాక్టర్ అశ్వథ్ నారాయణలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చింది.

మాజీ సీఎంకు షాక్

మాజీ సీఎంకు షాక్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన జగదీష్ శెట్టర్ తనకు కచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని భావించారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీ హైకమాండ్ నిర్ణయంతో సీనియర్లు షాక్ కు గురైనారు. ఉప ముఖ్యమంత్రి పదవులు ఆశించిన వారిలో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ ఆర్. అశోక్, కేఎస్. ఈశ్వరప్ప, బళ్లారి శ్రీరాములు ఉన్నారు.

బెంగళూరులో నువ్వానేనా !

బెంగళూరులో నువ్వానేనా !

బెంగళూరులోని పద్మనాభనగర్ ఎమ్మెల్యే ఆర్. అశోక్ ఇంతకు ముందు ఉప ముఖ్యమంత్రిగా, హోం శాఖా మంత్రిగా పని చేశారు. ఈ సారి కచ్చితంగా తనకు అదే శాఖలు కేటాయిస్తారని ఆర్. అశోక్ భావించారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. బెంగళూరులోని మల్లేశ్వరం ఎమ్మెల్యే డాక్టర్ అశ్వథ్ నారాయణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇంతకు ముందు అశ్వథ్ నారాయణకు మంత్రిగా పని చేసిన అనుభవం లేదు. బెంగళూరులోనే తన కులానికే (ఒక్కలిగ) చెందిన వ్యక్తి అశ్వథ్ నారాయణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తనకు పోటీగా పెడుతున్నారని ఆర్. అశోక్ అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఆర్. అశోక్ ఆయనకు ఇచ్చిన ప్రభుత్వ కారును వెనక్కి పంపించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈశ్వరప్పకే ఎందుకు ?

ఈశ్వరప్పకే ఎందుకు ?

కర్ణాటకలో ఇంతకు ముందు బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో హైకమాండ్ మీద ఒత్తిడి చేసిన కేఎస్. ఈశ్వరప్ప ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. తరువాత రాయణ్ణ బ్రిగేడ్ ద్వారా కేఎస్. ఈశ్వరప్ప వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పదవి తనకు సులభంగా వస్తుందని ఈశ్వరప్ప ధీమాగా ఉన్నారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. ఈశ్వరప్ప గతంలో నిర్వహించిన శాఖలు కాకుండా ఇప్పుడు ఆయనకు గ్రామీణ, పంచాయితీ రాజ్ శాఖలు కేటాయించారు. ఈశ్వరప్పకే ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని రాయణ్ణ బ్రిగేడ్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని రాయణ్ణ బ్రిగేడ్ నాయకులు హెచ్చరించారు.

శ్రీరాములుకు మొండిచెయ్యి

శ్రీరాములుకు మొండిచెయ్యి

తనకు కచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని బళ్లారి శ్రీరాములు భావించారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి రాకపోవడంతో బళ్లారి శ్రీరాములు ఆయన అనుచరుల దగ్గర, సీనియర్ల దగ్గర అసహనం వ్యక్తం చేశారన తెలిసింది. శ్రీరాములు కోరుకున్న శాఖలు ఆయనకు కేటాయించలేదు. శ్రీరాములకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి పదవి రాకపోవడంతో బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న సీఎం యడియూరప్ప ఇంటికి వెళ్లిన శ్రీరాములు అసహనం వ్యక్తం చేశారు. 2018 శాసన సభ ఎన్నికల ప్రచార సమయంలో శ్రీరాములకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని యడియూరప్పతో పాటు బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు శ్రీరాములకు మొండి చెయ్యి మిగిలిందని ఆయన అనుచరులు అంటున్నారు.

 రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి ?

రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి ?

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీ హైకమాండ్ తీరుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేశారని, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని అంటున్నారు. అనర్హత ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. రమేష్ జారకిహోళి ప్రాంతానికే చెందిన లక్ష్మణ సవదికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో ఆయన షాక్ కు గురైనారు. సుప్రీం కోర్టులో అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ జరిగి, ఏదో ఒక తీర్పు వచ్చిన తరువాత వారిలో అసమ్మతి పెరిగిపోయే అవకాశం ఉందని తెలిసింది.

రగిలిపోతున్న ఎమ్మెల్యేలు

రగిలిపోతున్న ఎమ్మెల్యేలు

మూడు ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇచ్చిన తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద మండిపడుతున్నారు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారని, వారిని పక్కన పెట్టి జూనియర్లకు, ఆరోపణలు ఉన్న నాయకులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారని బీజేపీ ఎమ్మెల్యేలు హైకమాండ్ ను ప్రశ్నిస్తున్నారు. హైకమాండ్ తీరుతో బీజేపీ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు.

English summary
Senior leaders of Karnataka BJP are unhappy on the party for not considering them for Deputy Chief Minister post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X