వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళకు మాజీ సీఎం, ఎమ్మెల్యేల ఒత్తిడి, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం, టార్గెట్ అసెంబ్లీ సమావేశాలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆరు రోజుల పాటు కేరళకు వెళ్లడానికి సిద్దం అయ్యారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరు నుంచి కేరళ వెలుతున్న బీఎస్ యడ్యూరప్ప తిరిగి డిసెంబర్ 6వ తేదీ బెంగళూరు చేరుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పతో పాటు ఎవరెవరు కేరళ వెలుతున్నారు ? అనే విషయం బయటకు రావడం లేదు.

ఎమ్మెల్యేలతో భేటీ

ఎమ్మెల్యేలతో భేటీ

మాజీ సీఎం. బీఎస్. యడ్యూరప్ప ఆధ్వర్యంలో గురువారం బెంగళూరులోని మల్లేశ్వరంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఆ సందర్బంలో కర్ణాటకలో అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడంలో విఫలం అయ్యిందని, ఏదైనా చెయ్యాలని బీఎస్. యడ్యూరప్ప మీద ఒత్తిడి తీసుకువచ్చారని సమాచారం.

ఆరు నెలలు

ఆరు నెలలు

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి అయ్యిందని బీజేపీ ఎమ్మెల్యేలు గుర్తు చేశారని తెలిసింది. సంకీర్ణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చెయ్యాలని బీఎస్. యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించారని సమాచారం.

 క్షణం తీరికలేదు

క్షణం తీరికలేదు


లోక్ సభ, శాసన సభ ఉప ఎన్నికలు, రాష్ట్ర పర్యటనలతో కొంతకాలంగా బీఎస్. యడ్యూరప్ప తీరికలేకుండా గడిపారు. ఈ సందర్బంలో కేరళలో ఆరు రోజుల పాటు ప్రకృతి చికిత్స చేయించుకుని వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోవాలని బీఎస్. యడ్యూరప్ప నిర్ణయించారని సమాచారం.

టార్గెట్ అసెంబ్లీ సమావేశాలు

టార్గెట్ అసెంబ్లీ సమావేశాలు

డిసెంబర్ 10వ తేదీ నుంచి బెళగావిలో కర్ణాటక శాసన సభ సమావేశాలు జరగనున్నాయి. బెళగావి శాసన సభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఆ సందర్బంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి బీఎస్. యడ్యూరప్ప మానసికంగా, శారీరకంగా సిద్దం కావడానికి ప్రకృతి చికిత్స చేయించుకోవడానికి కేరళ వెలుతున్నారని సమాచారం.

లోక్ సభ ఎన్నికలు

లోక్ సభ ఎన్నికలు

2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో అధిక సీట్లు కైవసం చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని బీఎస్. యడ్యూరప్ప నిర్ణయించారు. రాష్ట్ర పర్యటన సందర్బంగా విశ్రాంతి ఉండదని, అందుకే ఆరు రోజుల పాటు కేరళలో ప్రకృతి చికిత్స చేయించుకుని పూర్తి విశ్రాంతి తీసుకోవాలని బీఎస్. యడ్యూరప్ప నిర్ణయించారని సమాచారం.

English summary
Karnataka BJP State President, opposition leader BS Yeddyurappa will visit Kerala for six days to get treatment and to take rest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X