• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

karnataka సీఎంకు బీజేపీ భారీ షాక్ -యడ్డీ దింపివేతకు హైకమాండ్ కసరత్తు -అర్జున్ సింగ్ టూర్‌పై టెన్షన్

|

కర్ణాటకలో అధికార బీజేపీలో కొనసాగుతోన్న కుమ్ములాటలు చివరికి సిట్టింగ్ సీఎంను కుర్చీ దించేయాలనే లక్ష్యాన్ని చేరినట్లున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్పను పదవి నుంచి తొలగించి, మరో నేతకు పాలనా పగ్గాలు అప్పగించాలనే దిశగా బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు మీడియా రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆల్ ఈజ్ వెల్ అని ఢిల్లీ దూతలు చెబుతున్నప్పటికీ యడ్డీ ఊస్టింగ్ తప్పేలా లేదని తెలుస్తోంది..

హైకమాండ్ నిర్ణయం..

హైకమాండ్ నిర్ణయం..

మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధం లేనట్లుగా, అధికారుల పట్ల అదోరకం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోన్న యడ్యూరప్పను సీఎం పదవి నుంచి తొలగించాల్సిందేనంటూ అసంతృప్త నేతలు చాలా కాలంగా పట్టుపడుతున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా అసమ్మతి నేతల వాదనకు తలొగ్గారని తెలుసుకున్నారేమో, యడ్యూరప్ప సైతం ‘హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పదవిని వదులుకోడానికి సిద్ధం' ఇటీవలే ప్రకటించారు. యడ్యూరప్ప ప‌నితీరుపై అస‌మ్మ‌తి నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆయ‌న‌ను త‌ప్పించేందుకు బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకుందని హైక‌మాండ్ కు స‌న్నిహిత వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు

బెంగళూరుకు అర్జున్ సింగ్

బెంగళూరుకు అర్జున్ సింగ్

కర్ణాటక బీజేపీ ఇంచార్జి అర్జున్ సింగ్ మాత్రం య‌డియూర‌ప్పనే సీఎంగా కొన‌సాగుతార‌ని, మళ్లీ ఎన్నికల వరకు రాష్ట్రానికి ఆయనే సారధిగా ఉంటారని స్సష్టం చేశారు. బీజేపీ క‌ర్నాట‌క శాఖ సైతం ఇదే మాట చెబుతున్నది. క‌రోనా మ‌హ‌మ్మారిని యడ్డీ సార‌థ్యంలో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం స‌మ‌ర్ధంగా ఎదుర్కొంద‌ని, మంత్రులు, ఎమ్మెల్యేలు బాగా ప‌నిచేశార‌ని అరుణ్ సింగ్ కొనియాడారు. తక్షణం బెంగ‌ళూరు వెళ్లి అస‌మ్మ‌తి నేత‌ల‌తో మాట్లాడి స‌మ‌స్య‌లు స‌ర్ధుబాటు చేస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే,

యడ్డీ తొలగింపు ఖాయమేనా?

యడ్డీ తొలగింపు ఖాయమేనా?

అర్జున్ సింగ్ బెంగళూరు పర్యటనలో అసమ్మతి నేతల్ని కలిసి ఒక రిపోర్టు తయారుచేసి హైకమాండ్ కు సమర్పిస్తారని, బెంగళూరు పర్యటనకు ముందే ఆయన చెప్పినట్లు యడ్డీకి అనుకూలంగా రిపోర్టు వెళ్లే అవకాశాలున్నాయని, కానీ వాస్తవంలో మాత్రం సీఎం తొలగింపునకు హైకమాండ్ ఇటీవలే నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాల మాటగా జాతీయ మీడియా పేర్కొంది. నాయ‌క‌త్వ మార్పు వ్య‌వ‌హారం, అస‌మ్మ‌తి నేత‌ల క‌ట్ట‌డిపై అరుణ్ సింగ్ ఓవైపు క‌స‌ర‌త్తు సాగిస్తుండ‌గానే య‌డియూర‌ప్ప‌ను పాల‌నా ప‌గ్గాల నుంచి త‌ప్పించ‌డంపై బీజేపీ అగ్ర‌నాయ‌కత్వం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంద‌ని ప్ర‌చారం సాగుతుండ‌టంతో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది.

English summary
media reports says that Top sources in the BJP, Delhi, confirmed that the leadership change decision was taken after disgruntled leaders constantly raised issues with BS Yediyurappa's style of ruling with the top brass. but, Arun Singh, in charge of Karnataka's BJP unit on Thursday rubbished the speculations that the top brass was considering a change in the leadership and instead said that BS Yediyurappa has proved his mettle as a CM for the state and that he will continue till his tenure ends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X