వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక బడ్జెట్ సమావేశాలు, మూడు పార్టీ ఎమ్మెల్యేలు గైహాజరు, మాజీ మంత్రి రామలింగా రెడ్డి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో బుధవారం మొదలైన బడ్జెట్ సమావేశాలకు మూడు పార్టీల ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంతో మూడు పార్టీ నాయకులు షాక్ గురైనారు.

కర్ణాటక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజు 8 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు, ముగ్గురు బీజేపీ శాసన సభ్యులు, ఒక జేడీఎస్ ఎమ్మెల్యే శాసన సభ సమావేశాలకు హాజరుకాలేదు. మూడు పార్టీల నాయకులు శాసన సభ సమావేశాలకు హాజరు కాకపోవడంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

Karnataka budget session 2019: 3 MLAs who are taking lead of Operation lotus are absent for the assembly session.

బీజేపీకి చెందిన బెంగళూరులోని మల్లేశ్వరం శాసన సభ్యుడు అశ్వథ్ నారాయణ, మహదేవపుర ఎమ్మెల్యే అరవింద లింబావలి, అరభావి ఎమ్మెల్యే బాలచంద్ర జారకిహోళి బుధవారం శాసన సభ సమావేశానికి హాజరుకాలేదు. ఈ ముగ్గురు శాసన సభ్యులు ఆపరేషన్ కమలలో భాగంగా ముంబైలో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ చెందిన మంత్రి, గోకాక్ ఎమ్మెల్యే రామేష్ జారకిహోళి, అథణి ఎమ్మెల్యే మహేష్ కుమటహళ్ళి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర, చుంచోళి ఎమ్మెల్యే ఉమేష్ జాధవ్, కంప్లీ ఎమ్మెల్యే గణేష్ చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, బెంగళూరులోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రామలింగారెడ్డి, ఆయన కుమార్తె, జయనగర ఎమ్మెల్యే సౌమ్య రెడ్డి బుథవారం జరిగిన శాసన సభ సమావేశాలకు దూరంగా ఉన్నారు. వీరితో పాటు జేడీఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సైతం బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టారు.

English summary
Karnataka budget session 2019: 3 MLAs who are taking lead of Operation lotus are absent for the assembly session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X