వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణాలంటే లెక్క లేదు: కోతికి స్టీరింగ్ అప్పగించిన బస్సు డ్రైవర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

వామ్మో... కోతికి స్టీరింగ్ అప్పగించిన బస్సు డ్రైవర్

దేవణగిరి: ఈ మధ్య బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్ల చిన్న అజాగ్రత్తతోనే చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. బస్సు ఎక్కి మళ్లీ దిగేంతవరకు ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ ఏ చిన్నతప్పిదం చేసినా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. గత నెలలో జగిత్యాలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదమే ఇందుకు నిదర్శనం. ఇంతా తెలిసి కూడా డ్రైవర్లు తమ అజాగ్రత్తను వీడటం లేదు. ఫలితం ప్రయాణికుల ప్రాణాలు తీయడం తద్వారా కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ఇలాంటి అజాగ్రత్త డ్రైవరే కర్నాటకలో దర్శనమిచ్చాడు.

Karnataka bus driver suspended for making a monkey drive the bus

కర్నాటక రాష్ట్రం దేవనగిరి డివిజన్‌కు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ తను డ్యూటీ నిర్వర్తిస్తూ ఓ కోతిని తనతో పాటు డ్రైవింగ్ సీటులో కూర్చోబెట్టాడు. ఇది చూసిన ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఇదేంటంటూ బెంబేలెత్తిపోయారు. బస్సు అలా ఒక స్టాపుకు వెళ్లగానే బయట ఉన్న ప్రయాణికులు డ్రైవింగ్ సీటులో డ్రైవర్‌తో పాటు కోతిని చూసి బస్సు ఎక్కేందుకు భయపడ్డారు. కొందరు ఎక్కలేదు కూడా.ఇక బస్సు కదిలింది. డ్రైవర్ కోతిని నిమురుతూ కనిపించాడు.

ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకున్న డ్రైవర్ మరో చేత్తో కోతి తలను నిమురుతున్నాడు. ఇది చూసిన ప్రయాణికులు భయపడిపోయారు. ఇంకాస్త దూరం వెళ్లాక ఏకంగా కోతి చేతికే స్టీరింగ్ బాధ్యతలు అప్పజెప్పి తను మాత్రం గేర్ మారుస్తూ కూర్చున్నాడు. ఇది ఎంత ప్రమాదకరమో డ్రైవర్ గ్రహించలేకపోయినట్లుంది. లేదా ప్రయాణికుల ప్రాణాలు అంటే అంత అలసత్వమో తెలియదు కానీ కోతికి మాత్రం స్టీరింగ్ అప్పజెప్పాడు. ఈ సన్నివేశమంతా ఓ ప్రయాణికుడు రికార్డింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో డ్రైవర్‌‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన అక్టోబర్ 1న చోటుచేసుకుంది.

English summary
Commuters of Karnataka state bus were left stunned after a driver of Karnataka State Road Transport Corporation (KSRTC) allowed a langur (baboon) to take control on the steering wheel of the bus as he drove on.The video, shot by a passenger on the moving bus, shows the driver from KSRTC's Davanagere division patting the langur's back several times as he perched on the steering wheel. For a moment, the driver even allowed the langur to take control of the steering wheel, while he changed gears.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X