వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఉప ఎన్నికలు, బీజేపీ హవా ! సీ ఓటర్స్ సర్వే ఫలితాలు, గుడ్డికన్నా మెల్లమేలు, ఓటర్లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శాసన సభ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? అనే విషయం ఉత్కంఠగా మారింది. అయితే కర్ణాటక శాసన సభ ఉప ఎన్నిల పోలింగ్ పూర్తి అయిన తరువాత సీ ఓటర్స్ సర్వే విడుదల చేసింది. సీ ఓటర్స్ సర్వేలో కర్ణాటక అధికారంలో ఉన్న బీజేపీ అధిక సీట్లు కైవసం చేసుకుంటుందని వెలుగు చూసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని, జేడీఎస్ మాత్రం ఒక్క సీటుకే పరిమితం అయ్యే అవకాశం ఉందని సీ ఓటర్స్ సర్వే వెల్లడించింది.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

 బీజేపీ సత్తా చాటుతుందా ?

బీజేపీ సత్తా చాటుతుందా ?

కర్ణాటకలో గురువారం 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. బీజేపీ 9 నుంచి 12 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సీ ఓటర్స్ సర్వే వెల్లడించింది. కచ్చితంగా తాము 15 శాసన సభ నియోజక వర్గాల్లో విజయం సాధిస్తామని బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అయిన తరువాత రాత్రి 7 గంటల సమయంలో సీ ఓటర్స్ సర్వే వివరాలు వెల్లడించింది.

గుడ్డికన్నా మెల్లమేలు

గుడ్డికన్నా మెల్లమేలు

కర్ణాటకలో గురువారం 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో 15 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. అయితే 15 శాసన సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 6 నియోజక వర్గాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సీ ఓటర్స్ సర్వే వెల్లడించింది. కొన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిందని సీ ఓటర్స్ సర్వే అభిప్రాయం వెల్లడించింది.

జేడీఎస్ ఏక్ నిరంజన్ ?

జేడీఎస్ ఏక్ నిరంజన్ ?

కర్ణాటకలో గురువారం 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. 13 శాసన సభ నియోజక వర్గాల్లో అభ్యర్థులను పోటీకి బరిలో దింపిన జేడీఎస్ రెండు నియోజక వర్గాల్లో మాత్రం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. సీ ఓటర్స్ సర్వే ప్రకారం జేడీఎస్ పార్టీ ఒక్క నియోజక వర్గంలో విజయం సాధించే అవకాశం ఉందని, అదికూడా కచ్చితంగా చెప్పలేమని అభిప్రాయం వ్యక్తం చేసింది. జేడీఎస్ పార్టీ ఓట్లు మాత్రం చీల్చుతుందని, అనేక నియోజక వర్గాల్లో విజయం సాధించే అవకాశం లేదని సీ ఓటర్స్ సర్వే తెలిపింది.

బీజేపీ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష

బీజేపీ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఎక్కువ సీట్లలో విజయం సాధించి తన ప్రభుత్వాన్ని అధికారంలో ఉండేలా చెయ్యాలని అన్ని ప్రయత్నాలు చేసింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండాలంటే కచ్చితంగా కనీసం 7 సీట్లలో విజయం సాధించాలి. అయితే పలు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు అంటున్నాయి. మొత్తం మీద బీజేపీ అధికారంలో ఉంటుందా ? లేదా ? అనే విషయం డిసెంబర్ 9వ తేదీ స్పష్టంగా వెలుగు చూడనుంది.

English summary
Karnataka by elections 2019, C voters Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X