వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బళ్లారి రాజకీయాలకు మంత్రి శ్రీరాములు గుడ్ బై ?, నిన్న గాలి జనార్దన్ రెడ్డి, నేడు, సీఎం !

|
Google Oneindia TeluguNews

బళ్లారి/బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లా రాజకీయాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరులు, ప్రస్తుత ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు. అయితే ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి రాజకీయాలకు దూరం అయ్యారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నా బి. శ్రీరాములు సైతం బళ్లారి రాజకీయాలకు దూరం అవుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు బళ్లారి రాజకీయాలకు దూరం కావడంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురై అయోమమంలో పడిపోయారు.

తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!

చిత్రదుర్గలో ఎంట్రీ !

చిత్రదుర్గలో ఎంట్రీ !

2018 శాసన సభ ఎన్నికల సందర్బంగా చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు నియోజక వర్గం నుంచి బళ్లారి శ్రీరాములు పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి తరువాత మంత్రి అయ్యారు. తరువాత బళ్లారి జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా తనను నియమించాలని మంత్రి శ్రీరాములు ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు మనవి చేశారు. అయితే శ్రీరాములును రాయచూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా నియమించారు. అప్పటి నుంచి బళ్లారి జిల్లాకు శ్రీరాములు దూరం అవుతున్నారు.

ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

కర్ణాటకలోని 15 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 15 నియోజక వర్గాల్లో విజయనగర నియోజక వర్గం ఒకటి. విజయనగర నియోజక వర్గం నుంచి మాజీ మంత్రి ఆనంద్ సింగ్ పోటీ చేస్తున్నారు. అయితే విజయనగర నియోజక వర్గం నుంచి ఆనంద్ సింగ్ ను గెలిపించే భాద్యతల నుంచి బళ్లారి శ్రీరాములు దూరంగా ఉన్నారు.

వ్యవహారం చెడింది

వ్యవహారం చెడింది

మంత్రి బళ్లారి శ్రీరాములు, విజయనగరం అనర్హత ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మద్య అభిప్రాయవిభేదాలు ఉన్నాయి. బళ్లారి జిల్లాలోని విజయనగరం వేరు చేసి ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆనంద్ సింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే విజయనగరం ప్రత్యేక జిల్లాగా ప్రకటించడాన్ని మొదటి నుంచి మంత్రి బళ్లారి శ్రీరాములు వ్యతిరేకిస్తున్నారు.

 బళ్లారి శ్రీరాములు పేరు మాయం

బళ్లారి శ్రీరాములు పేరు మాయం

విజయనగరం నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆనంద్ సింగ్ ను గెలిపించే భాద్యతలను ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బీజేపీ సీనియర్ నాయకులు గోవింద కారజోళ, ఎస్. రవికుమార్, గెవియప్ప, సంగణ్ణ కరడి, హాలప్ప ఆచార్, నారాయణ సా బాండగ, దేవేంద్రప్పలకు అప్పగించారు. ఇక్కడా బళ్లారి శ్రీరాములను దూరంగా పెట్టడంతో ఆయన అభిమానులు, అనుచరులు బీజేపీ నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఆ రోజు శిష్యుడు నేడు దూరం

ఆ రోజు శిష్యుడు నేడు దూరం

విజయనగరం నియోజక వర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న ఆనంద్ సింగ్ ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములుకు ఆనంద్ సింగ్ దూరం అయ్యారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన బళ్లారి శ్రీరాములు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆనంద్ సింగ్ ఆ పార్టీలో చేరలేదు. బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అయిన ఆనంద్ సింగ్ ఈ రోజు మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆప్తమిత్రులు బళ్లారికి గుడ్ బై !

ఆప్తమిత్రులు బళ్లారికి గుడ్ బై !

బళ్లారి జిల్లా రాజకీయాలు అంటే మొదట టక్కున అందరూ చెప్పే పేర్లు గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, బళ్లారి శ్రీరాములు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని బళ్లారి జిల్లాలో అడుగు పెట్టరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో ఆ జిల్లాకు ఆయన దూరంగా ఉన్నారు. బళ్లారిలో అన్నీ తానై చూసుకుంటున్న మంత్రి బళ్లారి శ్రీరాములు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో బళ్లారి జిల్లాకు దూరంగా ఉన్నారు. మంత్రి పదవి చిక్కినా శ్రీరాములు బళ్లారి జిల్లాకు దూరం కావడంతో ఆయన అనుచరులు, గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు గురౌతున్నారు. విజయనగర ఉప ఎన్నికల భాద్యతల నుంచి శ్రీరాములును దూరం చెయ్యడంతో ఆయన దాదాపుగా బళ్లారి జిల్లా రాజకీయాలు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారని తెలిసింది.

English summary
Karnataka: All not ok between Anand Singh and minister B.Sriramulu. Now B Sriramulu out of Ballari politics. He not in charge for Vijayanagar by election scheduled on December 5, 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X