వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఉప ఎన్నిక ఫలితాలు: 7 చోట్ల బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్, ఒకచోట జేడీఎస్ లీడ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Karnataka Bypoll Results 2019 : How Many Seats BJP Needs ? || Oneindia Telugu

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

బీజేపీ దూకుడు..

బీజేపీ దూకుడు..

ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ దూసుకెళ్తుంది. ఏడు చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. చిక్ బళ్లపూర్‌లో బీజేపీ అభ్యర్థి కే సుధాకర్ 818 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు శివాజీనగర్, హస్నూర్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒక్క స్థానంలో జేడీఎస్ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు.

12మందిపై అనర్హత వేటు

12మందిపై అనర్హత వేటు

12 మంది జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ ఫిరాయించడంతో స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎల్లాపూర్, రానెబెన్నూర్, విజయనగర్, యశ్వంతపూర్, మహాలక్ష్మీ లేఅవుట్, చిక్ బళ్లపూర్, కేఆర్ పురం, శివాజీనగర్, కేఆర్ పేట్, హన్సూర్, అథానీ, కాగ్‌వాడ్ గోకాక్, హిరెకెరూర్, హోస్కోట్ నియోజకవర్గాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగింది.

105 మంది సభ్యులతో

105 మంది సభ్యులతో

కర్ణాటకలో బీజేపీకి 105 సభ్యులు ఉన్నారు. అసెంబ్లీ సభ్యుల మొత్తం సంఖ్య 225 కాగా.. 15 మందిపై అనర్హత వేటు పడింది. దీంతో సభ్యుల సంఖ్య 210కి చేరింది. 105 సభ్యులు గల బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ఎన్నికల్లో కనీసం 6 నుంచి 8 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిస్తే.. యడియూరప్ప ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోతోంది. లేదంటే మళ్లీ కర్ణాటకలో అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. కానీ లీడ్ చూస్తే బీజేపీ అభ్యర్థులు 7 చోట్ల ఉన్నారు. దీంతో యడియూరప్ప ప్రభుత్వం మనగలిగే అవకాశాలు ఉన్నాయి.

English summary
"Karnataka Assembly By-Election Results 2019 Live Updates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X