వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు, సిద్ధరామయ్య, దినేశ్ గుండురావు రాజీనామా

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. ఆయా స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 12 కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అనర్హత వేటుతో పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప ప్రభుత్వం 105 మంది ఎమ్మెల్యేల బలంతో ఉంది. 15 మందిలో ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ గెలుచుకుంటేనే యడియూరప్ప ప్రభుత్వ మెజార్టీకి ఢోకా లేకుండా పోతోంది.

Karnataka by-elections results today

Newest First Oldest First
5:01 PM, 9 Dec

ఉప ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీకి సిద్ధరామయ్య, పీసీసీకి దినేశ్ గుండురావు రాజీనామా
4:27 PM, 9 Dec

కేపీసీసీ పదవీకి దినేశ్ గుండురావు రాజీనామా
3:41 PM, 9 Dec

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ పదవీకి సిద్ధరామయ్య రాజీనామా
2:57 PM, 9 Dec

ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళితే జనం శిక్షిస్తారు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ
2:56 PM, 9 Dec

సుస్థిర ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టారు: ఉఫ ఎన్నిక ఫలితాలపై ప్రధాని మోడీ
2:55 PM, 9 Dec

తమ మెజార్టీ 117కి చేరిందంటున్న బీజేపీ నేత అరవింద్ లింబాలీ
1:19 PM, 9 Dec

ఉప ఎన్నిక ఫలితాలపై యడియూరప్ప హర్షం, సుస్థిర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తుందని కామెంట్
12:44 PM, 9 Dec

విజయం సాధిస్తోన్న 11 మందికి క్యాబినెట్‌లో చోటు: సీఎం యడియూరప్ప
12:27 PM, 9 Dec

గోకాక్ నుంచి బీజేపీ అభ్యర్థి రమేశ్ విజయం
12:26 PM, 9 Dec

12 చోట్ల బీజేపీ లీడ్ ఈసీ వర్గాల ప్రకటన, తుది ఫలితం తర్వాత ప్రకటిస్తామని వెల్లడి
12:09 PM, 9 Dec

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉండటంతో ఆలయానికి వెళ్లి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్న సీఎం యడియూరప్ప
11:55 AM, 9 Dec

మరో రెండు చోట్ల బీజేపీ అభ్యర్థుల విజయదుందుబి: విజయ్‌నగర్‌లో ఆనంద్ సింగ్, హిరెకెర్పూర్‌లో బీసీ పాటిల్ విజయం
11:39 AM, 9 Dec

ఎమ్మెల్యేలుగా గెలిచిన 12 మంది సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం: కర్ణాటక మంత్రి అశోక్
11:36 AM, 9 Dec

బెంగళూరు

బీజేపీ 12 స్థానాల్లో లీడ్‌లో ఉండటంలో తన తండ్రి, సీఎం యడియూరప్ప ఆశీర్వాదం తీసుకుంటున్న బీవై విజయేంద్ర, కుమారుడికి మిఠాయి తినిపిస్తున్న యడియూరప్ప
11:24 AM, 9 Dec

హన్సూరు, శివాజీనగర్‌లో కాంగ్రెస్, హోస్కొటే, యశ్వంత్‌పూర్‌లో జేడీఎస్ అభ్యర్థుల ముందంజ
11:22 AM, 9 Dec

11 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల లీడ్. ఆ నియోజకవర్గాలు ఇవే. అథానీ, చిక్‌బళ్లపుర, గోకాక్, హిరెక్‌రూర్, కాగ్వాడ్, కేఆర్ పేట్, కృష్ణరాజ్‌పేట్, మహాలక్ష్మీ లేఔట్, రాణిబెన్నూర్, విజయనగర, యెల్లపూర్‌
11:07 AM, 9 Dec

యశ్వంత్‌పూర్‌లో స్వల్ప ఆధిక్యంలో జేడీఎస్, 96 ఓట్ల లీడ్‌లో జేడీఎస్ అభ్యర్థి
10:41 AM, 9 Dec

బీజేపీ 12 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల, ఇండిపెండెంట్ ఒకచోట లీడ్, ఆధిక్యంలో లేని జేడీఎస్
10:40 AM, 9 Dec

బెంగళూరు

కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన డీకే శివకుమార్
10:38 AM, 9 Dec

హన్సూరులో 9వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి మంజునాథ్ 16,083 ఓట్ల లీడ్
10:38 AM, 9 Dec

శివాజీనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి 4500 ఓట్ల ఆధిక్యం
10:35 AM, 9 Dec

యెల్లపూర్‌లో బీజేపీ బోణీ, సంబరాలు జరుపుకుంటున్న శివరాం హెబ్బర్ మద్దతుదారులు
10:29 AM, 9 Dec

కేఆర్ పేట్‌లో బీజేపీ అభ్యర్థి 11523 ఓట్లలో లీడ్ బీజేపీ అభ్యర్థికి 17988 ఓట్లు కాంగ్రెస్ 6455 ఓట్లు జేడీఎస్ 6324 ఓట్లు వాటాల్ 222 ఓట్లు నోటాకు 415 ఓట్లు
10:01 AM, 9 Dec

బెంగళూరు

బీజేపీ 10, కాంగ్రెస్, జేడీఎస్ రెండేసి చోట్ల, ఇండిపెండెంట్ ఒకచోట లీడ్, నిమిష నిమిషానికి మారుతున్న ట్రెండ్స్
9:59 AM, 9 Dec

కాగ్వాడ్‌లో బీజేపీ అభ్యర్థి లీడ్ చిక్‌బళ్లపూర్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజ యెల్లపూర్‌లో బీజేపీ అభ్యర్థి 16,961 ఓట్ల ఆధిక్యం మహాలక్ష్మీ లేఔట్ బీజేపీ అభ్యర్థి లీడ్ గోకాక్‌లో 4 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థులు ముందంజ
9:58 AM, 9 Dec

యశ్వంత్‌పూర్‌లో నెక్ టు నెక్ పోటీ 2091 ఓట్లతో జేడీఎస్ అభ్యర్థి లీడ్ జేడీఎస్ 13760 ఓట్లు బీజేపీ 11699 ఓట్లు కాంగ్రెస్ 1059 ఓట్లు నోటాకు 213 ఓట్లు
9:56 AM, 9 Dec

మహాలక్ష్మీ లేఔట్‌లో బీజేపీ అభ్యర్థి కే గోపలయ్య ముందంజ
9:55 AM, 9 Dec

విజయనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆనంద్ సింగ్ లీడ్
9:55 AM, 9 Dec

గోకాక్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి 12365 ఓట్ల ముందంజ
9:49 AM, 9 Dec

యశ్వంత్‌పూర్‌లో మొదటి రౌండ్ ముగిసేసరికి జేడీఎస్ అభ్యర్థి 8130 ఓట్ల ముందంజ, కాంగ్రెస్ అభ్యర్థికి 458 ఓట్లు, బీజేపీ క్యాండెట్‌కు 4909 ఓట్లు
READ MORE

English summary
The results of the December 5 bypolls to 15 assembly seats in Karnataka will be declared on Monday and will have a bearing on the future of chief minister B S Yediyurappa’s government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X