• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజకీయ ఉత్కంఠ: కాసేపట్లో..15 అసెంబ్లీ స్థానాల ఫలితాలు: బీజేపీ నిలబడేనా..!

|

రాజకీయంగా ఉత్కంఠకు తెర లేపిన కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలోని 15 స్థానాలకు ఈ నెల ఐదో తేదీన పోలింగ్‌ జరగ్గా ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటంతో అన్ని పార్టీలు టెన్షన్ గా కనిపిస్తున్నాయి. ఉదయం 11 గంటలలోపే ఫలితాలు వెల్లడి కానున్నాయి. అన్ని సర్వేలు బీజేపీకి పది సీట్లు రావడం ఖాయమని ప్రకటించాయి. బీజేపీకి ఏడు స్థానాలు దక్కితే యడియూరప్ప ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. అలా కాకుంటే 14 నెలలు పాలన సాగించిన కాంగ్రెస్‌, జేడీఎ్‌సలు మరోసారి చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మైనారిటీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న యడియూరప్ప తన ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంది. కనీసం 8 సీట్లలో గెలిస్తేనే బీజేపీ ప్రభుత్వం ఒడ్డున పడుతుంది. మరోవైపు అధికార బీజేపీని నిలువరించి తిరిగి అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

 ఎమ్మెల్యేల రాజీనామాలతో..

ఎమ్మెల్యేల రాజీనామాలతో..

14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో ఇటీవలే కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కూలిపోయింది. ఆ వెంటనే రాజీనామాలు చేసిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. వారి పైన స్పీకర్ వేటు..సుప్రీం తాజా ఉత్తర్వులతో వారు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసారు. దీంతో..ఈ నెల 5న కర్నాకటలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలుండటంతో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు.

 ఆరుగురు గెలిస్తేనే..బీజేపీకి మెజార్టీ

ఆరుగురు గెలిస్తేనే..బీజేపీకి మెజార్టీ

దీంతో అసెంబ్లీలో మిగిలిన 222కు గాను మ్యాజిక్ నెంబర్ 112. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్‌తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. సోమవారం వెల్లడయ్యే ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజార్టీ ఉంటుంది. లేదంటే యెడ్యూరప్ప సర్కారు మైనార్టీలో పడిపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 66, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలున్నారు. మధ్యాహ్నంలోగా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు దగ్గర పడే కొద్దీ బీజేపీ తరఫున పోటీ చేసిన అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలతో పాటు వివిధ పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.మాలతో..

బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్‌పోల్స్‌..

బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్‌పోల్స్‌..

ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ బీజేపీకి పట్టం కట్టడంతో సీఎం యడియూరప్ప ధైర్యంగా కనిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ శాస్త్రీయమైనవి కాదంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు మొత్తం 15 స్థానాల్లో, జేడీఎస్‌ 12 చోట్ల బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించిన అనర్హత ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యం కూడా నేడు తేలనుంది. ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడుతుండటంతో నేతలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ధర్మస్థలలోని మంజునాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అటు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ షిర్డీ వెళ్లారు. సాయినాథుడిని దర్శించుకున్నారు.

English summary
Karnataka by poll results may announce by this afternoon. On 5th of this month by poll held in 15 constituencies. Present Govt continuation is depend on these results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X