• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాసలీలల సీడీ: మొదటిసారి అక్కడే... పలుమార్లు లైంగిక దాడి... సిట్ విచారణలో యువతి కీలక విషయాలు

|

కర్ణాటకలో సంచలనం రేపుతోన్న రాసలీలల సీడీ కేసులో ఎట్టకేలకు బాధిత యువతి అజ్ఞాతం వీడిన సంగతి తెలిసిందే. మంగళవారం (మార్చి 30) బెంగళూరులోని మెజిస్ట్రేట్‌లో బాధితురాలి వాంగ్మూలం రికార్డ్ చేయగా.. బుధవారం(మార్చి 31) సిట్ అధికారులు ఆమెను విచారించారు. విచారణలో బాధిత యువతికి సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ మంత్రి రమేష్ జర్కిహోళితో పరిచయం... ఇద్దరి మధ్య అసలేం జరిగింది... ఆయన వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదురైంది... వంటి ప్రశ్నలను ఆమెకు సంధించారు. అందుకు బాధితురాలు చెప్పిన సమాధానాలను రికార్డ్ చేశారు.

మొదటిసారి అక్కడే..

మొదటిసారి అక్కడే..

'కొన్నాళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం కోసం మొదటిసారి విధానసౌధకు వెళ్లినప్పుడు మంత్రి జర్కిహోళిని కలిశాను. ఆ సమయంలో ఆయన తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చారు. మల్లేశ్వరం పీజీ అని సేవ్ చేసుకోమన్నారు. ఆ నంబర్ మరెవరికీ ఇవ్వొద్దన్నారు. కొద్దిరోజులకు... శారీరకంగా తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చారు. రెండు,మూడుసార్లు ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. సీనియర్ మంత్రి కావడంతో ఎవరికీ చెప్పే ధైర్యం చేయలేక భయపడి మౌనంగా ఉండిపోయాను.' అని బాధిత యువతి సిట్ అధికారులకు వెల్లడించింది.

మొదటిసారి అతనితో చెప్పాను...

మొదటిసారి అతనితో చెప్పాను...

'నాపై లైంగిక దాడిని అమ్మతో పాటు ఎవరికీ చెప్పుకోలేదు. ఈ విషయాన్ని ఎలా చెప్పుకోగలను. అత్యాచారానికి పాల్పడిన సమయంలో జర్కిహోళి వీడియో కూడా తీశారు. దాన్ని అతని వద్దే పెట్టుకుని పిలిచినప్పుడల్లా రావాలని బెదిరించారు. దీంతో ఆయనకు భయపడి వెళ్లాల్సి వచ్చింది. జర్కిహోళి నన్ను అసభ్య పదజాలంతో తిట్టేవారు. అతని ప్రవర్తన రోజురోజుకు తనను తీవ్రంగా ఇబ్బందిపెడుతుండటంతో కాలేజీలో నా కొలిగ్ శ్రవణ్‌కి విషయం చెప్పాను.' అని ఆమె తెలిపారు.

ఎలా లీకైందో తెలియదన్న యువతి...

ఎలా లీకైందో తెలియదన్న యువతి...


'శ్రవణ్ ద్వారా నరేశ్ పరిచయమయ్యారు. సాక్ష్యాధారాలు లేకుండా మంత్రిపై కేసు పెట్టలేమని చెప్పారు. దీంతో మరోసారి మంత్రి వద్దకు వెళ్లినప్పుడు నేను కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఒక కాపీ నా వద్ద పెట్టుకుని... మరో కాపీని నరేష్‌కు ఇచ్చాను... అయితే వీడియో ఎవరు లీక్ చేశారో నాకు తెలియదు.' అని సిట్ విచారణలో బాధితురాలు వెల్లడించినట్లు సమాచారం. విచారణ అనంతరం బుధవారం సాయంత్రం 6.45గం. సమయంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ బాధితురాలిని అజ్ఞాత స్థలానికి తరలించారు.

అరెస్ట్ చేయాలంటున్న కాంగ్రెస్...

అరెస్ట్ చేయాలంటున్న కాంగ్రెస్...


ఇదే కేసులో బాధితురాలికి,జర్కిహోళికి మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను ఆమె తరుపు న్యాయవాది జగదీశ్ సిట్ అధికారులకు అందించారు. మరో ప్రముఖ న్యాయవాది సూర్య ముకుంద్ రాజ్ కూడా యువతికి మద్దతుగా నిలిచారు. అయితే తానే ఆయన సహకారం కోరానని న్యాయవాది జగదీశ్ తెలిపారు. అయితే ముకుంద్ రాజ్ కేపీసీసీ లీగల్ సెల్ అధ్యక్షుడు కావడంతో.. ఇదంతా కాంగ్రెస్ పార్టీ పనేనని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... మెజిస్ట్రేట్ ముందు బాధిత యువతి తనంతట తానే,ఎవరి ప్రమేయం,బలవంతం లేకుండా స్టేట్‌మెంట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

English summary
It is known that the victim has finally the victim's statement was recorded in a magistrate's office in Bangalore in CD case on Tuesday (March 30). SIT officials questioned her on Wednesday (March 31). SIT officials showered questions on the victim during the interrogation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X