వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14 టీఎంసీల నీరు విడుదల చెయ్యండి, కర్ణాటక సీఎం, తమిళనాడుకు, తాగు నీరు, రైతులకు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని హేమావతి జలాశయం నుంచి 14. 53 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హాసన్ జిల్లా గూరూరిలోని హేమావతి జలాశయంలోకి 27, 623 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆదేశాలతో తమిళనాడుకు నీరు విడుదల కానుంది.

హేమావతి జలాశయం నుంచి ఆగస్టు 7వ తేదీ నుంచి 14. 53 టీఎంసీల నీరు విడుదల చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం బుధవారం అంగీకరించింది. సీఎం యడియూరప్ప ఆదేశాలతో హేమావతి జలాశయం నుంచి కాలువల్లోకి 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.

Karnataka Chief Minister B.S.Yediyurappa ordered to release water from Hemavathi dam Gorur

హేమవాతి జలాశయం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో జలాశయం నుంచి నీరు ఇంకా ఎక్కువగా విడుదల చెయ్యడానికి అవకాశం ఉంది. హేమావతి జలాశయం 2, 922 అడుగుల ఎత్తు ఉంది. బుధవారం (ఆగస్టు 7వ తేదీ) నాటికి హేమావతి జలాశయంలో 2, 899. 77 అడుగుల ఎత్తు నీరు చేరింది.

తాగునీటి కోసం నిల్వ ఉంచుకుని మిగిలిన నీరు విడుదల చెయ్యాలని, రైతులు సాగు చేసుకోవడం కోసం అవకాశం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో తమిళనాడుకు నీరు విడుదల చెయ్యడానికి 14. 53 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది.

హేమావతి జలాశయం కింద హాసన్, తుమకూరు, మండ్య జిల్లాల్లోని చెరువులు, ఆనకట్టలు ఉన్నాయి. మూడు జిల్లాల్లోని చెరువులు, ఆనకట్టలను పూర్తిగా నీటితో నింపడానికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేస్తున్నారు.

English summary
Karnataka Chief Minister B.S.Yediyurappa ordered to release water from Hemavathi dam Gorur, Hassan district, Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X