వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని నరేంద్ర మోడీది డోంగ్లీ బడ్జెట్, ప్రజల కోసం ఉత్తమ బడ్జెట్, బీజేపీ బంఫర్ ఆఫర్లు, సీఎం ఫైర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో తాము అత్యుత్తమ బడ్జెట్ ప్రవేశ పెడుతామని, ప్రధాని నరేంద్ర మోడీ లాగా డోంగ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. ఆపరేషన్ కమల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు ఇస్తున్న బంఫర్ ఆఫర్లు చూస్తే షాక్ కు గురౌతున్నామని సీఎం కుమారస్వామి చెప్పారు.

ఫిబ్రవరి 6 బడ్జెట్

ఫిబ్రవరి 6 బడ్జెట్

కర్ణాటకలో ఫిబ్రవరి 6వ తేదీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపధ్యంలో బెంగళూరులోని పద్మనాభనగరలోని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఇంటికి సీఎం కుమారస్వామి వెళ్లారు. దాదాపు గంట సేపు మాజీ ప్రధాని దేవేగౌడ, సీఎం కుమారస్వామి చర్చలు జరిపారు.

ఆ విషయంలో మాట్లాడను

ఆ విషయంలో మాట్లాడను

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన సీఎం కుమారస్వామి ఆపరేషన్ కమల గురించి తాను మాట్లాడనని అన్నారు. ప్రతి గంట గంటకు ఆపరేషన్ కమల జరుగుతోందని ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. ఆపరేషన్ కమల గురించి తాను ఎక్కువ ఆలోచించనని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.

డబ్బులు ఎక్కడివి ?

డబ్బులు ఎక్కడివి ?

బీజేపీ నాయకులు ఎప్పుడు ఏ ఎమ్మెల్యేలతో సంప్రధిస్తున్నారు అనే విషయం తనకు పూర్తిగా తెలుసని, ఎమ్మెల్యేలకు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారని అనే సమాచారం తనకు తెలుసని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. బీజేపీ నాయకులకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.

 ప్రధాని మోడీ డోంగ్లీ బడ్జెట్

ప్రధాని మోడీ డోంగ్లీ బడ్జెట్

కర్ణాటక ప్రజలకు ఏమి అవసరం అని తనకు తెలుసని, తాను ఉత్తమ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నానని కుమారస్వామి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లాగా తాను డోంగ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టనని సీఎం కుమారస్వామి అన్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఉత్తమ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామని సీఎం కుమారస్వామి అన్నారు.

ఆపరేషన్ కమలకు అడ్డురాను

ఆపరేషన్ కమలకు అడ్డురాను

బీజేపీ నాయకులు చేస్తున్న ఆపరేషన్ కమలకు తాను ఎలాంటి అభ్యంతరం చెప్పనని, వారు సంతోషంగా ఆపని చేసుకోవాలని సీఎం కుమారస్వామి వ్యంగంగా అన్నారు. తాము 15 రోజులు కష్టపడి బడ్జెట్ తయారు చేశామని సీఎం కుమారస్వామి అన్నారు. కేంద్ర మంత్రి డీవీ. సధానంద గౌడ ఆరోపణలకు అసలు ఆయనకు ప్రజల అవసరాల గురించి ఏమి తెలుసు అని బహిరంగంగా చెప్పాలని సీఎం కుమారస్వామి అన్నారు.

English summary
Bengaluru: Ahead of the budget session Karnataka Chief Minister H.D.Kumaraswamy met the JD(S) supremo H.D.Deve Gowda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X