బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం సిద్దరామయ్య గెలుపు, శ్రీరాములు మీద పోటీ, చచ్చి గెలిచారు. సొంత జిల్లాలో, లింగాయత్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బాగల్ కోటే జిల్లా బాదామి శాసన సభ నియోజక వర్గంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వల్పమెజారిటీతో విజయం సాధించారు. బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములుతో నువ్వానేనా అంటూ పోటీపడిన సీఎం సిద్దరామయ్య చివరికి స్వల్పమెజారిటీతో చచ్చిగెలిచారు.

సీఎం రిలాక్స్

సీఎం రిలాక్స్

మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గంలో దారుణంగా ఓడిపొయిన సీఎం సిద్దరామయ్య బాగల్ కోటే జిల్లా బాదామి శాసన సభ నియోజక వర్గంలో బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు మీద 3, 250 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఊపిరిపీల్చుకున్నారు.

సిద్దూ, శ్రీరాములు ఫైట్

సిద్దూ, శ్రీరాములు ఫైట్


సొంత జిల్లా మైసూరులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓటమిపాలైనారు. బాదామి శాసన సభ నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య, శ్రీరాములు నువ్వానానే అంటూ ప్రతిరౌండ్ లో పోటీపడ్డారు. అయితే చివరి రౌండ్ లో సీఎం సిద్దరామయ్య విజయం సాధించారు.

 సీఎం హోదాలో పోటీ

సీఎం హోదాలో పోటీ

బాదామి శాసన సభ నియోజక వర్గంలో పోటీ చేసిన సీఎం సిద్దరామయ్యకు 64, 022 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బళ్లారి ఎంపీ శ్రీరాములుకు 60, 335 ఓట్లు, జేడీఎస్ అభ్యర్థి హనుమంత బేవినమరద కు 23, 067 ఓట్లు వచ్చాయి. సీఎం స్థానంలో ఉన్న సిద్దరామయ్య కేవలం 3, 250 ఓట్ల మెజారిటీ విజయం సాధించి ఊపిరిపీల్చుకున్నారు.

 లింగాయత్ ఓట్లు

లింగాయత్ ఓట్లు

సీఎం సిద్దరామయ్యకు బాదామి శాసన సభ నియోజక వర్గంలో బి. శ్రీరాములు గట్టిపోటీ ఇచ్చారు. లింగాయత్ లకు ప్రత్యేక ధర్మం, మతం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం సిద్దరామయ్య ఆ ఓటర్ల బలంతో అతికష్టం మీద శ్రీరాములుపై విజయం సాధించి చివరికి పరువు నిలుపుకున్నారు.

English summary
Karnataka Election Results 2018. Karnataka Chief Minister Siddaramaiah wins Badami, Bagalkot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X