వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైప్రొఫైల్ మర్డర్: అక్రమ సంబంధం: గర్భంతో ఉన్న భార్యను మట్టుబెట్టిన డాక్టర్: రైలు కింద పడి.. !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఓ హైప్రొఫైల్ మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో మృతురాలి భర్తే ప్రధాన నిందితుడిగా తేల్చారు. తన భార్యను హత్య చేసిన ఆరు రోజుల తరువాత నిందితుడు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.. అరెస్టు భయంతో. ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని పోలీసులు రైలు పట్టాల వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా- వారి పిల్లలు అనాథలయ్యారు. పైగా హత్య సమయంలో ఆ మహిళ గర్భంతో ఉందని పోలీసులు నిర్ధారించారు.

దంత వైద్యుడిగా మంచి పేరు..

దంత వైద్యుడిగా మంచి పేరు..

కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లా కడూర్‌లో ఓ మహిళ తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు. ఈ నెల 17వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. హతురాలి పేరు కవిత. తన భర్త డాక్టర్ రేవంత్, పిల్లలతో కలిసి కడూర్‌లో నివసిస్తున్నారు. రేవంత్.. దంత వైద్యుడు. కడూర్ సమీపంలోని బిరూర్‌లో క్లినిక్‌ను నడిపిస్తున్నాడు. రేవంత్, కవితలకు ఏడేళ్ల కిందట వివాహమైంది. కవిత స్వస్థలం ఉడుపి. వివాహం అనంతరం దంపతులు కడూర్‌లో నివసిస్తున్నారు.

17న దారుణహత్య.. దోపిడీ దొంగల పనిగా అనుమానం..

17న దారుణహత్య.. దోపిడీ దొంగల పనిగా అనుమానం..

ఈ నెల 17వ తేదీన కవిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణహత్యకు గురయ్యారు. గొంతు కోసి హత్య చేశారు. తొలుత ఈ హత్యను దోపిడీ దొంగలు చేసి ఉండొచ్చని అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ దోపిడీ దొంగలే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనడానికి పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. హతురాలి ఇళ్లు ప్రధాన రహదారికి ఆనుకునే ఉండటం, 24 గంటలూ వాహనాల రాకపోకలు సాగించే చోట దోపిడీ దొంగలు ఈ దారుణానికి పాల్పడే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చారు. దీనితో దర్యాప్తు తీరును మార్చారు. కుటుంబ సభ్యుల మీద నిఘా వేశారు.

పోస్టుమార్టమ్ నివేదికలో అసలు విషయం..

పోస్టుమార్టమ్ నివేదికలో అసలు విషయం..

కవిత పోస్టుమార్టమ్ నివేదికతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందు కవితకు నిద్రను తెప్పించే ఇంజిక్షన్ ఇచ్చినట్లు ఈ నివేదికలో తేలింది. దీనితో పోలీసులు డాక్టర్ రేవంత్‌పై నిఘా వేశారు. పలుమార్లు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. అయినప్పటికీ.. ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించలేకపోవడంతో అతణ్ని అరెస్టు చేయలేకపోయారు. పోస్టుమార్టమ్‌లో వారి అనుమానాలు నిజమయ్యాయి. ఇంజిక్షన్ ఇచ్చే సామర్థ్యం డాక్టర్ రేవంత్ ఒక్కడికే ఉండటంతో అతణ్ని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అరెస్టు భయంతో ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఉదయం రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అక్రమ సంబంధమే కారణమంటూ..

అక్రమ సంబంధమే కారణమంటూ..

తన భార్యను డాక్టర్ రేవంత్ హత్య చేయడానికి అక్రమ సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 14వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా రేవంత్.. తాను అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్న మహిళతో గడిపాడని తేలింది. ఈ విషయం కవితకు తెలియడంతో ఆమె నిలదీసిందని, అప్పటి నుంచి వారి మధ్య మూడు రోజుల పాటు ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. దీనితో విసుగెత్తిపోయిన రేవంత్.. తన భార్యను పిల్లల ముందే గొంతు కోసి హత్య చేశాడని, అనంతరం దాన్ని దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడని వెల్లడించారు.

English summary
In a shocking incident a pregnant woman was found murdered with her throat slit on February 17 in Kadur here. It has now come to light that she was murdered allegedly by her husband, a doctor by profession. The accused later killed himself. Dr Revanth allegedly killed his wife Kavita as he had an affair with another woman, sources said. He then allegedly committed suicide by coming under a running train, as he was reportedly scared to face the police inquiry. The murder and suicide have resulted in an infant and a toddler being orphaned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X