వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభ ఎన్నికలు: దేవుడు చెప్పాడని అంటున్న చిన్నారి వైరల్ వీడియో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన కర్ణాటకలోని మండ్య లోక్ సభ ఎన్నికల్లో బహుబాష నటి సుమలత విజయం సాదిస్తారని దేవుడు జోస్యం చెప్పాడని ఒక చిన్నారి చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. మండ్య లోకసభ ఎన్నికల్లో స్వంతత్ర పార్టీ అభ్యర్థి సుమలత విజయం సాదిస్తారని చిన్నారి చెప్పినట్లు తీసిన ఓ వీడియో గురించి ఇప్పుడు చర్చ మొదలైయ్యింది. వేల సంఖ్యలో షేర్ అవుతున్న ఈ వీడియోను అదే స్థాయిలో లైక్ చేస్తున్నారు.

అక్కడ చిన్నారుల వైరల్ వీడియో

వినయ్ గౌడ అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశాడు. అబ్బబ్బా ఏమి మా మండ్య రాజకీయాలు గురు అంటూ కామంట్ పెట్టాడు. ఈ వీడియో చూసిన కొందరు సూపర్ గురు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది దేవుడు అవరించినట్లు ప్రవర్తించిన బాలుడిని చూసి నీవు నటసార్వభౌమా అంటు కితాబు ఇస్తున్నారు.

ఆయన సర్వేల కలకలం

ఆయన సర్వేల కలకలం

మండ్య లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ భాగస్వామిగా కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా బహుబాష నటి సుమలత పోటీ చేశారు. మండ్యలో ఎవరు గెలుస్తారు అంటూ అనేక సర్వేలు జరిగాయి. మండ్యలో ఎవరు గెలుస్తారు అంటూ సర్వే చెయ్యాలని ఇంటలిజెన్స్ అధికారులకు సీఎం కుమారస్వామి సూచించారని ప్రచారం జరిగింది.

అక్కడ కాంగ్రెస్ లో అసమ్మతి !

అక్కడ కాంగ్రెస్ లో అసమ్మతి !

మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన నిఖిల్ కుమారస్వామి మీద కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల సంకీర్ణ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు పని చేశారని సమాచారం. ఇదే సమయంలో బెంగళూరులోని ఓ హోటల్ లో సుమలత ఇచ్చిన విందుకు మండ్య జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నాయకులు హాజరైనారని తెలిసింది.

ఆయన ఇంటలిజెన్స్ నివేదికలు

ఆయన ఇంటలిజెన్స్ నివేదికలు

ఇంటలిజెన్స్ అధికారులు చేసిన పలు సర్వేలు తికమకగా ఉన్నాయని తెలిసింది. మండ్య లోక్ సభ ఎన్నికల్లో నిఖిల్ కుమారస్వామి గెలుస్తారని కొన్ని సర్వేలు, లేదులేదు సుమలత గెలుస్తారని కొన్ని సర్వేలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా సుమలత పోటీ చేశారు. ఇదే సమయంలో హైకమాండ్ తీరుతో అసహనం వ్యక్తం చేసిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమలతకు మద్దతుగా పని చేశారని వెలుగు చూసింది. సుమలతకు మద్దతుగా ప్రచారం చేసిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హైకమాండ్ వేటు వేసింది.

English summary
Karnataka: Children in Mandya playing the game in which they are predicting Sumalatha Ambareesh who is an independent candidate from Mandya will win Lok Sabha elections 2019, against Nikhil Kumaraswamy, JDS candidate
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X