వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక సీఎం యడ్యూరప్ప పర్సనల్ సెక్రటరీ గా హుక్కేరి: వ్యూహాలలో దిట్ట, టచ్ లో ఎమ్మెల్యేలు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వ్యూహాలు రచించడంలో దిట్ట అనే తీసుకున్నారా??

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారులను నియమించుకుంటున్పారు. రైతుల రుణమాఫీల విషయంలో అధికారులతో చర్చించిన బీఎస్. యడ్యూరప్ప తరువాత అధికారుల బదిలీలపై దృష్టిసారించారు. కర్ణాటక సీఎం యడ్యూరప్ప పర్సనల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి హుక్కేరి బాధ్యతలు స్వీకరించారు. ఐఏఎస్ అధికారి హుక్కేరి వ్యూహాలు రచించడంలో దిట్ట అనే పేరు ఉంది.

ముఖ్యమంత్రి పీఏ

ముఖ్యమంత్రి పీఏ

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప తనకు అత్యంత నమ్మకమైన సీనియర్ ఐఏఎస్ అధికారిని పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. శివమొగ్గ జిల్లా పంచాయితీ ముఖ్య కార్యనిర్వహక అధికారిగా విధులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి విపి. హుక్కేరి ముఖ్యమంత్రి యడ్యూరప్ప పీఏగా విధుల్లో చేరారు.

నమ్మకమైన వ్యక్తి

నమ్మకమైన వ్యక్తి

సీనియర్ ఐఏఎస్ అధికారి విపి. హుక్కేరి బీఎస్. యడ్యూరప్పకు చాల నమ్మకమైన వ్యక్తి. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎస్ యడ్యూరప్పకు సహకరిస్తారని సమాచారం. వ్యూహాలు రచించడంలో సీనియర్ ఐఏఎస్ అధికారి విపి. హుక్కేరి దిట్ట.

యడ్యూరప్ప మార్కు

యడ్యూరప్ప మార్కు

కర్ణాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీఎస్. యడ్యూరప్ప ఇప్పుడు తన మార్కు రాజకీయాలు మొదలు పెట్టారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులకు సినిమా చూపిస్తున్నారు.

15 రోజులు గడుపు

15 రోజులు గడుపు

గురువారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్. యడ్యూరప్ప తన ప్రభుత్వం మెజారిటీ ఎమ్మెల్యేల బలపరీక్షను నిరూపించుకోవడానికి 15 రోజులు గడువు ఇవ్వావలని గవర్నర్ వాజుబాయ్ వాలాకు మనవి చేశారు. బలపరీక్ష నిరూపించుకోవడానికి గవర్నర్ వాజుబాయ్ వాలా 15 రోజులు సమయం ఇచ్చారు.

బీజేపీ నాయకుల ఆశలు

బీజేపీ నాయకుల ఆశలు

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని కొనసాగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రిసార్టు రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే బీజేపీకి టచ్ లోకి వెలుతారో అని కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

English summary
Karnataka CM B.S.Yeddyurappa appointed IAS officer V.P.Hukkeri as his personal secretory. He already transferred 5 IPS officer from the morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X