బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CM Work From Home, హోమ్ క్వారంటైన్ లో అప్ప, కారు డ్రైవర్, ఎస్కార్ట్ సిబ్బందికి పాజిటివ్, హడల్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు రాజకీయ ప్రముఖులు కూడా హడలిపోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, అనేక మంది రాజకీయ ప్రముఖులను పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్ తాజాగా మంత్రులు, ముఖ్యమంత్రులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తన కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిన వెంటనే మరో సీఎం హోమ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. హోమ్ క్వారంటైన్ నుంచి సీఎం తన కార్యకలాపాలు ( Work From Home) నిర్వహిస్తారని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, సీనియర్ ఎమ్మెల్యే మీడియాకు చెప్పారు. సీఎం ఆరోగ్యంగా ఉన్నారని, ఎవ్వరూ టెన్షన్ పడనవసరం లేదని ఆ ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు.

Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !

 సీఎంకు తీరికలేదు

సీఎంకు తీరికలేదు

కర్ణాటకలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రతిరోజు వీలైనన్ని గంటల పాటు ఆ వ్యాధి నిర్మూలన కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దేశ ఐటీ, బీటీ సంస్థల రాజధాని బెంగళూరులో ఎవ్వరూ ఊహించని విధంగా రెండు వారాల నుంచి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఈ దెబ్బకు కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ప్రతిరోజు మంత్రులు, అధికారులతో తీరకలేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

 సీఎం కారు డ్రైవర్, ఎస్కార్ట్ సిబ్బందికి పాజిటివ్

సీఎం కారు డ్రైవర్, ఎస్కార్ట్ సిబ్బందికి పాజిటివ్

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు అదనపు కారు డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తికి, సీఎం కాన్వాయ్ ఎస్కార్ట్ సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. అయితే ప్రతిరోజు కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పతో కలిసి పని చేస్తున్న ఉద్యోగులు ఎవ్వరికీ కరోనా పాజిటివ్ అని రాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది క్లారిటీ ఇచ్చారు. అయితే తాను Work From Homeలో బిజీగా ఉన్నానని, ఎప్పటిలాగే తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని సీఎం బీఎస్. యడియూరప్ప ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

 సీఎం అధికారిక నివాసం దెబ్బ

సీఎం అధికారిక నివాసం దెబ్బ

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధికారిక నివాసం బెంగళూరులోని కృష్ణలో పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రతిరోజు అధికారిక నివాసం కృష్ణలో సీఎం బీఎస్. యడియూరప్ప అధికారిక కార్యక్రమాలు, మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేవారు. కృష్ణలో పని చేస్తున్న ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో బీజేపీ వర్గాలు హడలిపోయాయి.

 హోమ్ క్వారంటైన్ లో సీఎం అప్ప !

హోమ్ క్వారంటైన్ లో సీఎం అప్ప !

కారు అదనపు డ్రైవర్, ఎస్కార్ట్ సిబ్బందిలో కొందరికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి హోమ్ క్వారంటైన్ కు పరిమితం అయ్యారు. ఇంటి నుంచి శుక్రవారం బీఎస్. యడియూరప్ప అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం బీఎస్. యడియూరప్ప కొందరు మంత్రులు, అధికారులతో చర్చించారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Recommended Video

KCR, KTR ఇద్దరిదీ వ్యూహాత్మక నిశ్శబ్దమేనా..? || Oneindia Telugu
 డోంట్ వర్రీ.... బి హ్యాపీ

డోంట్ వర్రీ.... బి హ్యాపీ

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఎప్పటిలాగే రోజువారి కార్యకలాపాలలో బిజీబిజీగా ఉన్నారని, ఉదయం వాకింగ్ చేశారని, ఫోన్ లో, వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడుతున్నారని సీఎం రాజకీయ కార్యదర్శి, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రేణుకాచార్య శుక్రవారం మీడియాకు చెప్పారు. ఈరోజు తాను సీఎం బీఎస్. యడియూరప్ప ఇంటికి వెళ్లి సుమారు 40 నిమిషాల పాటు ఆయనతో చర్చించి వస్తున్నానని, ఆయన చాలా ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవ్వరూ చింతించనవసరం లేదని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రేణుకాచార్య క్లారిటీ ఇచ్చారు. ప్రతిరోజు సీఎం బీఎస్. యడియూరప్పతో కలిసి పని చేస్తున్న ఉద్యోగులు ఎవ్వరికీ కరోనా వ్యాధి సోకలేదని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య అంటున్నారు. మొత్తం మీద కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప సైతం కరోనా భయంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని మీడియా కోడైకూస్తోంది.

English summary
Coronavirus: Karnataka CM B S Yediyurappa Goes Into Self Quarantine From Today And Says He Will Work From Home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X