బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీఏ ఇంటికి పరుగు తీసిన సీఎం, అసలు ఏం జరుగిందో ?, మాజీ మంత్రి, ఎమ్మెల్యే దెబ్బతో టెన్షన్, రహస్యంగా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆయన పీఏ ఎన్ఆర్. సంతోష్ ఇంటికి ఇంటికి పరుగు తియ్యడంతో తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది. బెంగళూరులోని డాలర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పీఏ ఇంటికి స్వయంగా సీఎం బీఎస్. యడియూరప్ప వెళ్లడం, తరువాత ఆయనతో రహస్యంగా మాట్లాడటంతో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్ఆర్. సంతోష్ విషయంలో మాజీ మంత్రి విశ్వనాథ్, సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేసిన తరువాత సీఎం ఆయన పీఏ సంతోష్ ఇంటికి వెళ్లి రహస్యంగా చర్చించడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందో ? అనే విషయం అంతు చిక్కడం లేదు.

Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ !Sadist: పెళ్లి కొడుక్కి బెంజ్ కారు, 5 కేజీ బంగారు, ఫస్ట్ నైట్ భరత్ రెడ్డి ఏం చేశాడంటే ? శోభనం చెట్టెక్కింది, కథ !

 సీఎం పీఏగా ఫేమస్

సీఎం పీఏగా ఫేమస్

గత శుక్రవారం రాత్రి బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని సొంత ఇంటికి వెళ్లిన సంతోష్ తరువాత ఇంట్లో నిద్రమాత్రలు మింగేసిన ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ భార్య జాహ్నవి వెళ్లి భర్తను పలకరించగా అతను అపస్మారకస్థితిలో పడి ఉన్న విషయం గుర్తించి వెంటనే ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్. రామయ్య ఆసుపత్రికి తరలించడం కలకలం రేపింది. కర్ణాటక ముఖ్యమంత్రి సమీప బంధువు, ఆయన రాజకీయ కార్యదర్శిగా (పీఏ)గా సంతోష్ బీజేపీ నాయకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 సీఎంకు ఊహించని షాక్

సీఎంకు ఊహించని షాక్

తన రాజకీయ కార్యదర్శి, సమీప బంధువు ఎన్ఆర్. సంతోష్ ఆత్మహత్యాయత్నం చేశాడని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సమాచారం అందింది. వెంటనే అదే రోజు అర్దరాత్రి సీఎం బీఎస్. యడియూరప్ప ఎంఎస్. రామయ్య ఆసుపత్రికి పరుగు తీశారు. సంతోష్ ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో బీఎస్. యడియూరప్ప సంతోష్ భార్య జాహ్నవికి ధైర్యం చెప్పారు. తరువాత అసలు ఏం జరిగింది అంటూ సీఎం యడియూరప్ప సంతోష్ సన్నిహితుల నుంచి ఆరా తీశారు. సంతోష్ ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో సీఎం యడియూరప్పకు ఊహించని షాక్ తగిలింది.

 బాంబు పేల్చిన సంతోష్ భార్య

బాంబు పేల్చిన సంతోష్ భార్య

రాష్ట్ర రాజకీయాల విషయంలో కొన్ని రోజుల నుంచి తన భర్త సంతోష్ చాలా టెన్షన్ పడుతున్నాడని అతని భార్య జాహ్నవి ఆ రోజు అన్నారు. ఉదయం బయటకు వెళ్లిన తన భర్త సంతోష్ రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వచ్చి అతని గదిలోకి వెళ్లాడని. భోజనం చెయ్యాలని పిలవడానికి వెళ్లి చూడగా అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, మాకు కుటుంబ సమస్యలు ఏమీ లేవని సంతోష్ భార్య జాహ్నవి క్లారిటీ ఇచ్చింది. అయితే సంతోష్ భార్య జాహ్నవి ఆ రోజు చెప్పింది ఎంతమాత్రం నిజం అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

 సంతోష్ సింపుల్ గా రివర్స్ గేర్

సంతోష్ సింపుల్ గా రివర్స్ గేర్

సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన సంతోష్ మీడియాతో మాట్లాడుతూ తాను ఆత్మహత్యాయత్నం చేశానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. మూడు రోజుల క్రితం తాను ఓ పెళ్లికి వెళ్లాను, అక్కడ భోజనం చెయ్యడంతో నకు ఫుడ్ ఇన్ ఫెక్షన్ అయ్యిందని, అందువలన అనారోగ్యానికి గురైనానని, ఆ మాత్రలకు బదులు వేరే మాత్రలు తీసుకోవడం వలన ఇలా జరిగిందని సంతోష్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

 మాజీ మంత్రి, ఎమ్మెల్యే స్టేట్ మెంట్ కలకలం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే స్టేట్ మెంట్ కలకలం

హణసూరు ఉప ఎన్నికల సందర్బంగా బీజేపీ ఇచ్చిన ఎన్నికల నిధులను ముఖ్యమంత్రి బీఎస్. యడియూప్ప పీఏ సంతోష్ నొక్కేసి మమ్మల్ని మోసం చేశాడని మాజీ మంత్రి హెచ్ఆర్. విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంతోష్ ఆత్మహత్యాయత్నం వేనుక చాలా పెద్ద కథ ఉందని, ఈసారి సీఎం యడియూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన తరువాత అసలు ఏం జరిగిందో తాను మీడియా ముందు చెబుతానని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ బాంబు పేల్చారు.

Recommended Video

Suresh prabhu Complaint on Jagan | జగన్ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులకు లేఖలు !!
 ఓరి నాయనో.... ఏంది కథ ?

ఓరి నాయనో.... ఏంది కథ ?

మాజీ మంత్రి విశ్వనాథ్, సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ సంతోష్ మీద ఆరోపణలు చేసిన తరువాత సీఎం బీఎస్. యడియూరప్ప ఉలిక్కిపడ్డారని తెలిసింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సంతోష్ బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పీఏ సంతోష్ ఇంటికి ఏకంగా సీఎం బీఎస్ యడియూరప్ప వెళ్లారు. సీఎం బీఎస్. యడియూరప్ప, సంతోష్ రహస్యంగా మాట్లాడారని సచారం. సీఎం, ఆయన పీఏ ఏం మాట్లాడుకున్నారు ? అనే విషయం బయటకు రాలేదని తెలిసింది. మొత్తం మీద ఏపీ ఇంటికి స్వయంగా సీఎం బీఎస్. యడియూరప్ప వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Karnataka Chief Minister B.S. Yediyurappa met and had a discussion with his political secretary NR Santosh in Bengaluru, who attempted to suicide few days back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X