బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus:నిన్న చైనా అధ్యక్షుడిపై కేసు, నేడు సీఎంపై ఫిర్యాదు, ప్రజలు ప్రాణాలతో గేమ్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్ 19) మహమ్మారిని అరికట్టడంలో, ఆ వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకోవడంలో విఫలం అయిన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ విఫలం అయ్యారని ఇప్పటికే కేసు నమోదైయ్యింది. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాధి అరికట్టడానికి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించారని, ప్రజల ప్రాణాలతో, వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద ఏకంగా గవర్నర్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను స్వయంగా సీఎం బీఎస్. యడియూరప్ప ఉల్లంఘించారని, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించిన ఆయన మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

Coronavirus: కర్ణాటకలో 10 మంది, 20 ఏళ్ల యువతి UKరిటన్, బెంగళూరులో హడల్!Coronavirus: కర్ణాటకలో 10 మంది, 20 ఏళ్ల యువతి UKరిటన్, బెంగళూరులో హడల్!

చైనా అధ్యక్షుడు, సీఎం అప్ప మీద కేసులు !

చైనా అధ్యక్షుడు, సీఎం అప్ప మీద కేసులు !

కరోనా వైరస్ అరికట్టకుండా ఆ వ్యాధి వ్యాపించి ప్రజల మరణించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పరోక్షంగా కారణం అయ్యారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని ముజఫర్ పూర్ కోర్టులో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ఫిర్యాదు చేశారు. కరోనా వైరస్ అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఉల్లంఘించారని ఆరోపిస్తూ గవర్నర్ కు ఫిర్యాదు చెయ్యడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.

కరోనా దెబ్బతో శుభకార్యాలకు చెక్ !

కరోనా దెబ్బతో శుభకార్యాలకు చెక్ !

కరోనా వైరస్ అరికట్టడానికి వివాహాలు, శుభకార్యాలు, ప్రజలు ఎక్కువగా హాజరయ్యే కార్యక్రమాలు రద్దు చెయ్యాలని ప్రజలకు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే స్వయంగా సీఎం యడియూరప్ప జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ మార్చి 15వ తేదీన బెళగావిలో జరిగిన వివాహ శుభకార్యానికి స్వయంగా సీఎం యడియూరప్పతో పాటు వందలాది మంది ప్రజలు, జిల్లాధికారులు హాజరైనారని ఆర్ టీఐ కార్యకర్త టీ. నరసింహమూర్తి ఆరోపించారు. ఈ కార్యక్రమం వలన కరోనా వైరస్ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఇచ్చినట్లు అయ్యిందని, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన సీఎం యడియూరప్ప మీద చర్యలు తీసుకోవాలని ఆర్ టీఐ కార్యకర్త టీ. నరసింహమూర్తి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

క్రిమినల్ కేసు కంటే పెద్ద నేరం

క్రిమినల్ కేసు కంటే పెద్ద నేరం

కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని, బహిరంగ శుభకార్యాలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యే వివాహ శుభకార్యక్రమాలు నిర్వహించకూడదని, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే ఐపీఎస్ సెక్షన్ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో కొన్ని వివాహ శుభకార్యాలు, పెళ్లిళ్లు రద్దు అయ్యాయని ఆర్ టీఐ కార్యకర్త టీ. నరసింహమూర్తి గుర్తు చేస్తున్నారు.

ప్రజల జీవితంతో సీఎం చెలగాటం ?

ప్రజల జీవితంతో సీఎం చెలగాటం ?

స్వయంగా సీఎం యడియూరప్ప ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు, బీజేపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఉల్లంఘించారని ఆర్ టీఐ కార్యకర్త టీ. నరసింహమూర్తి ఆరోపించారు. బెళగావి విధాన పరిషత్ సభ్యుుడు, ప్రభుత్వ చీఫ్ విప్ మహంతేశ్ కవటగిమఠ కుమార్తె డాక్టర్ పూజా వివాహా శుభకార్యానికి సీఎం యడియూరప్ప, హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్, మంత్రి శ్రీమంత్ పాటిల్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, జిల్లాధికారులు, స్థానిక నాయకులు హాజరైనారని ఆర్ టీఐ కార్యకర్త టీ. నరసింహమూర్తి గుర్తు చేశారు. ఈ విధంగా ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన సీఎంతో పాటు మంత్రులు, అధికారుల మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ టీఐ కార్యకర్త టీ. నరసింహమూర్తి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

Recommended Video

కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu
దేశంలోనే కర్ణాటకలో కరోనా వైరస్ మొదటి చావు

దేశంలోనే కర్ణాటకలో కరోనా వైరస్ మొదటి చావు

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వ్యాధి (COVID 19) హడలు పుట్టిస్తోంది. కరోనా వైరస్ తో దేశంలో అనేక కేసులు నమోదైనా మొదట మృతి చెందింది మాత్రం కర్ణాటకలోనే అనే విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కరోనా వ్యాధిని అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇవ్వాలని, అయితే ఇదే ప్రభుత్వ ఆదేశాలను స్వయంగా సీఎం యడియూరప్ప ఉల్లంఘిస్తే ప్రజలు ఎవరితో వారి గోడు చెప్పుకోవాలని ఆర్ టీఐ కార్యకర్త టీ. నరసింహమూర్తి ప్రశ్నించారు. అందువలన సీఎం యడియూరప్పతో పాటు, మంత్రులు, అధికారుల మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ టీఐ కార్యకర్త టీ. నరసింహ మూర్తి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

English summary
Karnataka CM BS Yeddyurappa has been accused of violating the Coronavirus (COVID 19) transmission guidelines. Human rights activist Narasimha Murthy has lodged a complaint with the governor against the CM Yediyurappa regarding violating guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X