వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎమ్మెల్యేల విషయంలో సీఎంకు అమిత్ షా ఏం చెప్పారు, నామినేషన్లకు నో చాన్స్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటకలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల విషయంలో తరువాత నిర్ణయం తీసుకుందామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారని సమాచారం. సోమవారం సుప్రీం కోర్టు అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ చేసిన తరువాత ఏం తీర్పు చెబుతుందో తెలుసుకుని తరువాత చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని అమిత్ షా సీఎం యడియూరప్పతో అన్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

మంచం మీదకు వస్తే మజా చేద్దాం, స్వామీజీ ఆడియో, వీడియోలు వైరల్, భర్త హనీట్రాప్!మంచం మీదకు వస్తే మజా చేద్దాం, స్వామీజీ ఆడియో, వీడియోలు వైరల్, భర్త హనీట్రాప్!

 సీఎం పరుగో పరుగు

సీఎం పరుగో పరుగు

కర్ణాటకలో శాసన సభ ఉప ఎన్నికలకు తేదీ ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఢిల్లీకి పరుగు తీశారు. ఎందుకంటే బీజేపీకి ఉప ఎన్నికలు చాలెంజ్ గా నిలిచాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి 17 మంది ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద ఎదురు తిరగడంతో అనర్హత వేటు పడింది. ఇదే విషయంలో అమిత్ షాతో చర్చించడానికి ఆదివారం సీఎం యడియూరప్ప ఢిల్లీ వెళ్లారు.

సుప్రీం కోర్టులో విచారణ

సుప్రీం కోర్టులో విచారణ

సోమవారం అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ సుప్రీం కోర్టులో జరగనుంది. అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు తరువాత అనర్హత ఎమ్మెల్యేల విషయం చర్చించాలని అమిత్ షా నిర్ణయించారని, అదే విషయం సీఎం యడియూరప్పకు చెప్పారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

సీఎంతో పాటు నేతలు

సీఎంతో పాటు నేతలు

అనర్హత ఎమ్మెల్యేలతో భేటీ కావడానికి అమిత్ షా ఆసక్తి చూపించలేదని తెలిసింది. సీఎం యడియూరప్ప వెంట ఉప ముఖ్యమంత్రి అశ్వథ్ నారాయణ, అనర్హత ఎమ్మెల్యే జారకిహోళి సన్నిహితుడు భరత్ ఢిల్లీ వెళ్లారు. అనర్హత ఎమ్మెల్యేలకు అన్యాయం చెయ్యకూడదని, మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారు చాల సహకరించారని సీఎం యడియూరప్ప ఢిల్లీ బీజేపీ హైకమాండ్ ముందు చెప్పారని తెలిసింది.

ఉప ఎన్నికలకు నామినేషన్లు

ఉప ఎన్నికలకు నామినేషన్లు

కర్ణాటకలోని 15 శాసన సభ నియోజక వర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అక్టోబర్ 21వ తేదీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈనెల 21 నుంచి ఎన్నికల నియమావలి అమలులో ఉందని ఎన్నికల కమిషన్ అధికారి సంజీవ్ కుమార్ ఇప్పటికే చెప్పారు. మిగిలిన రెండు శాసన సభ నియోజక వర్గాల వివాదం కోర్టులో విచారణ జరుగుతున్నందున ఉప ఎన్నికలు జరగడం లేదు.

ఆ ఎమ్మెల్యేలకు నో చాన్స్

ఆ ఎమ్మెల్యేలకు నో చాన్స్

అప్పటి కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయంతో అనర్హత ఎమ్మెల్యేలు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోకముందే బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్, మస్కీ నియోజక వర్గాల వివాదం కోర్టులో ఉంది. తరువాత అనర్హతకు గురైన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ప్రస్తుతం ఉప ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల కమిషన్ అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. బెంగళూరులోని కేఆర్ పురం, శివాజీనగర్, యశవంతపుర, మహాలక్ష్మి లేఔట్, హోస్ కోటే, చిక్కబళ్లాపుర, కేఆర్ పేట, హణసూరు, విజయనగర, రాణిబెన్నూరు, హీరేకరూరు, గోకాక్, అథణి హుణసూరు నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

English summary
KarnTk CM BS Yediyuappa Meets Amit Shah Discussed About Disqualified MLA, Karnataka Chief Minister BS Yeddyurappa said that he was hopeful of a positive judgement, ahead of the Supreme Court hearing the rebel Congress-JDS MLAs' plea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X