వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికల కోసం సీఎం మాస్టర్ ప్లాన్, 15 మంది మంత్రులు, ప్రతిపక్షాల కథ క్లోజ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఎలాగైనా ఉప ఎన్నికల్లో 15 నియోజక వర్గాలో బీజేపీ అభ్యర్థులు విజయం సాదించేలా సీఎం యడియూరప్ప మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే 15 శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే, విజయం మాత్రం బీజేపీదే అంటూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ దెబ్బతో ప్రతిపక్షాల కథ క్లోజ్ అంటున్నాయి బీజేపీ వర్గాలు.

మాజీ వైస్ చాన్సలర్ హత్య, సీఎం మీద కేసు పెట్టాడు, నడి రోడ్డులో నరికి చంపేశారు !మాజీ వైస్ చాన్సలర్ హత్య, సీఎం మీద కేసు పెట్టాడు, నడి రోడ్డులో నరికి చంపేశారు !

ప్రభుత్వం భవిష్యత్తు

ప్రభుత్వం భవిష్యత్తు

ఉప ఎన్నికల భవిష్యత్తు కర్ణాటక ప్రభుత్వం మీద ఆదారపడి ఉంటుందని సీఎం బీఎస్. యడియూరప్పకు భాగా తెలుసు. ఎందుకంటే బీజేపీ పూర్తి కాలం అధికారంలో ఉండాలంటే ఉప ఎన్నికల్లో వీలైనన్ని నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.

సీఎం మాస్టర్ ప్లాన్

సీఎం మాస్టర్ ప్లాన్

15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని సీఎం బీఎస్. యడియూరప్ప ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికలు జరిగే శాసన సభ నియోజక వర్గాల బీజేపీ నాయకులతో బీఎస్. యడియూరప్ప చర్చించారు. ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ గెలిచేలా ప్రచారం చెయ్యాలని స్థానిక నాయకులకు సీఎం యడియూరప్ప సూచించారు.

ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో మంత్రి

ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో మంత్రి

ప్రతి నియోజక వర్గంలో విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం బీఎస్. యడియూరప్ప. 15 నియోజక వర్గాలకు 15 మంది మంత్రులను ఇన్ చార్జ్ లు గా నియమించాలని సీఎం బీఎస్. యడియూరప్ప నిర్ణయించారు.

సీఎం ధీమా

సీఎం ధీమా

ప్రతి నియోజక వర్గానికి ఓ మంత్రిని ఇన్ చార్జ్ గా నియమిస్తే ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుందని, బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తే మీ నియోజక వర్గాలను మరింత అభివృద్ది చేస్తామని ప్రజలకు హామీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని సీఎం యడియూరప్ప నిర్ణయించారు.

ఫలితం ఉంటుంది

ఫలితం ఉంటుంది

ఉప ఎన్నికల విషయం గురించి సీఎం బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరిగే ప్రతి నియోజక వర్గానికి ఓ మంత్రిని ఇన్ చార్జ్ గా నియమిస్తామని, అందుకు కచ్చితంగా తమకు ఫలితం ఉంటుందని సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రతి నియోజక వర్గంలో బీజేపీ కార్యకర్తల గెలుపుకోసం కార్యకర్తలు పని చేస్తున్నారని యడియూరప్ప చెప్పారు.

న్యాయం జరుగుతుంది

న్యాయం జరుగుతుంది

సుప్రీం కోర్టు తీర్పు కోసం తాము ఎదురు చూస్తున్నామని యడియూరప్ప అన్నారు. అనర్హత ఎమ్మెల్యేలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని. ఉప ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి అనే విషయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కోర్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. మొత్తం మీద 15 శాసన సభ నియోజక వర్గాల్లో విజయం సాధించాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Karnataka CM BS Yediyurappa planing to appoint ministers as election in charge in by elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X