బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lockdown: పక్కింటోళ్లు తరిమేశారు, కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదు, తప్పు మాది కాదు, సీఎం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, ప్రజల సహకారం ముఖ్యమని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. ఐటీ బీటీ సంస్థల దేశరాజధాని బెంగళూరులో ఇక ముందు లాక్ డౌన్ విస్తరించమని సీఎం స్పష్టం చేశారు. మాస్క్ లేకుండా ఎవ్వరైనా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.

కర్ణాటకలో కరోనా వైరస్ తాండవం చెయ్యడానికి పక్కరాష్ట్రాల నుంచి వస్తున్న ప్రజలే కారణం అని సీఎం ఆరోపించారు. కరోనా విషయంలో ప్రతిపక్షాలు విమర్శించకుండా ఆ వ్యాధి నిర్మూలణకోసం వారి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం పరోక్షంగా కాంగ్రెస్ నాయకులపై సెటైర్లు వేశారు. తప్పు మాది కాదు కరోనా రోగులను పక్కింటోళ్లు (మహారాష్ట్ర, తమిళనాడు) తరిమేశారు అని సీఎం ఆరోపించారు.

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో!Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో!

కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదు

కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదు

కర్ణాటకలో గత కొంత కాలంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ అయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. మంగళవారం సాయంత్రం బెంగళూరులో సీఎం. బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, ప్రజల సహకారం ముఖ్యమని సీఎం బీఎస్. యడియూరప్ప చెప్పారు.

మాస్క్ లేకుంటా మైండ్ బ్లాక్

మాస్క్ లేకుంటా మైండ్ బ్లాక్

బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో ఏ ఒక్కరూ మాస్క్ లేకుండా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సీఎం బీఎస్. యడియూరప్ప ప్రజలకు మనవి చేశారు. కొందరు తిక్కచేష్టలు చేసి మాస్క్ లు లేకుండా రోడ్ల మీదకు వచ్చి మీటింగ్ లు పెట్టినా, అంటువ్యాధులు వ్యాపించడానికి కారణమైనా అలాంటి వారిపై పోలీసులు, అధికారులు కఠినచర్యలు తీసుకుంటారని సీఎం బీఎస్. యడియూరప్ప హెచ్చరించారు.

తప్పుమాది కాదు...... పక్కింటోళ్లు తరిమేశారు

తప్పుమాది కాదు...... పక్కింటోళ్లు తరిమేశారు

కర్ణాటకలో మొదట కరోనా కట్టడికి పోలీసులు, అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రాణాలు అడ్డుపెట్టి పని చేశారని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. కర్ణాటకలో కరోనా వైరస్ తాండవం చెయ్యడానికి కారణం ఇక్కడి ప్రజలు కాదని సీఎం బీఎస్. యడియూరప్ప స్పష్టం చేశారు. కరోనా హాట్ స్పాట్ కేంద్రాలు అయిన మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి అక్కడి ప్రజలు కర్ణాటకలోకి రావడం వలనే కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయని సీఎం బీఎస్. యడియూరప్ప ఆరోపించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడానికి తప్పు మాదికాదని పక్కింటోళ్లదని (మహారాష్ట్ర, తమిళనాడు) కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ఆరోపించారు.

24 గంటల్లో కరోనా ఫలితాలు

24 గంటల్లో కరోనా ఫలితాలు

ఇక ముందు బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో కరోనా వైద్యపరీక్షలు చేయించుకున్న 24 గంటల్లో వాటి ఫలితాలు వెల్లడిస్తామని, ఆ దిశగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. కేవలం 5 శాతం మందికి మాత్రమే ఐసీయూలు, వెంటిలేటర్లు అవసరం అని, 80 శాతం మందికి కరోనా వైరస్ లక్షణాలు లేకపోయినా ఆసుపత్రులు వచ్చి చికిత్స చేసుకుంటున్నారని సీఎం బీఎస్. యడియూరప్ప చెప్పారు. బెంగళూరుతో సహ కర్ణాటకలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు కోవిడ్- 19 రోగులకు చికిత్స చెయ్యడానికి అవకాశం ఇస్తామని ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు హామీ ఇచ్చాయని సీఎం. బీఎస్. యడియూరప్ప అన్నారు.

రాజకీయాలు చేసే టైమ్ కాదు మిత్రమా!

రాజకీయాలు చేసే టైమ్ కాదు మిత్రమా!

కరోనా వైరస్ కట్టడి కోసం మా ప్రభుత్వం (బీజేపీ) శక్తివంచన లేకుండా పని చేస్తోందని, అయితే ప్రతిపక్ష నాయకులు మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. మీరు మా మీద ఆరోపణలు చెయ్యడం మానుకుని మాకు మీ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు, మాజీ సీఎంలు సిద్దరామయ్య, హెచ్.డీ. కుమారస్వామి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కు సీఎం. బీఎస్. యడియూరప్ప మనవి చేశారు.

Recommended Video

#N95Mask : N95 మాస్క్‌లతో జాగ్రత్త.. హానికరం అంటున్న కేంద్రం! || Oneindia Telugu
దేనికైనా మేము రెఢీ

దేనికైనా మేము రెఢీ

కరోనా వైరస్ అరికట్టడానికి వైద్యపరికరాల కొనుగోలులో ఏ ఒక్కరూపాయి కూడా అవినీతి జరగలేదని, మీకు ఏమైనా అనుమానం ఉంటే మమ్మల్ని అడిగితే 24 గంటల్లో మీ ముందు రికార్డులు పెడుతామని, ఏ విచారణకైనా మేము సిద్దంగా ఉన్నామని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. మొత్తం మీద బెంగళూరులో లాక్ డౌన్ ఎత్తివేయడంతో సిలికాన్ సిటీ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

English summary
Bengaluru lockdown: Karnataka Chief Minister BS Yediyurappa Ruled out extension of lockdown in Bengaluru and other parts of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X