వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక, మహారాష్ట్ర సీఎంల భేటీ, ప్రధాని జోక్యం, మహాదాయి, కృష్ణా నది నీళ్లు, ఉత్కంఠ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో మొదటి విడత మంత్రివర్గం విస్తరణ పూర్తి అయిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఇతర రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మహారాష్ట్రలో పర్యటించడానికి వెళ్లారు. రెండు నదులు (మహాదాయి, కృష్ణా) నీటి పంపిణి విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో యడియూరప్ప చర్చలు జరపడానికి సిద్దం అయ్యారు. ఇదే విషయంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకుంటారని యడియూరప్ప అంటున్నారు.

సీఎం, అధికారులు

సీఎం, అధికారులు

మహారాష్ట్ర బయలుదేరడానికి ముందు ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో తాను భేటీ అయ్యి చర్చించనున్నానని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో పాటు అక్కడి అధికారులతో చర్చలు జరుపుతానని సీఎం యడియూరప్ప అన్నారు.

మహాదాయి నీరు

మహాదాయి నీరు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ముఖ్యంగా తాను మహాదాయి నీటి పంపిణి విషయంలో చర్చలు జరుపుతానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. మహాదాయి నీటి కోసం ఎన్నో ఏళ్ల నుంచి కర్ణాటక ప్రజలు, కన్నడ సంఘాలు పోరాటం చేస్తున్నాయి.

కృష్ణా నది, మోడీ జోక్యం !

కృష్ణా నది, మోడీ జోక్యం !

కృష్ణా నది నీరు విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు జరుపుతామని యడియూరప్ప అన్నారు. ఇప్పటికే కృష్ణా నది నీరు విషయంలో జోక్యం చేసుకుని సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేశామని సీఎం యడియూరప్ప మీడియాకు చెప్పారు.

ప్రధాని మోడీ వస్తారు

ప్రధాని మోడీ వస్తారు

సెప్టెంబర్ 6వ తేదీ బెంగళూరులో కర్ణాటక మంత్రివర్గ సమావేశం ఉందని, ఆ సమావేశంలో అనేక విషయాల గురించి చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక వస్తున్నారని సీఎం యడియూరప్ప చెప్పారు.

చాల నష్టం జరిగింది

చాల నష్టం జరిగింది

కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల కారణంగా చాల నష్టం జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా చూపిస్తామని సీఎం యడియూరప్ప అన్నారు. ఇప్పటికే కర్ణాటకకు న్యాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చామని సీఎం యడియూరప్ప అన్నారు. సీఎం యడియూరప్ప వెంట ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ, మంత్రి బసవరాజ్ బోమ్మయ్ ముంబై వెళ్లారు.

రెండు రాష్ట్రాల్లో బీజేపీ

రెండు రాష్ట్రాల్లో బీజేపీ

మహారాష్ట్రలో, కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతో ఇంత కాలం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిద సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని బీఎస్. యడియూరప్ప నిర్ణయించారని కర్ణాటకు చెందిన బీజేపీ నేతలు అంటున్నారు.

English summary
After Cabinet Expansion Chief minister BS Yediyurappa will Going to meet Maharashtra Cheif minister Decendra Fadnavis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X