వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపం, కొడుకు కోసం ఓటు వెయ్యలేని సీఎం దంపతులు, అదే కారణం, సుమలతతో ఢీ కొట్టిన హీరో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మొత్తం మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఎవరు గెలుస్తారు అని ఎందురుచూస్తున్నారు. మండ్య నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. నిఖిల్ కుమారస్వామి గెలుపు కోసం సీఎం కుమారస్వామి దంపతులు ఓటు వెయ్యలేకపోయారు.

సీఎం కుమారస్వామితో పాటు ఆయన సతీమణి, జేడీఎస్ ఎమ్మెల్యే అనితా కుమారస్వామి సైతం నిఖిల్ గౌడకు ఓటు వెయ్యలేకపోయారు. సీఎం కుమారస్వామి, ఆయన సతీమణి, రామనగర జేడీఎస్ ఎమ్మెల్యే అనితా కుమారస్వామిలకు బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గంలో ఓటు హక్కు ఉంది.

రామనగర జిల్లాలోని కాతగానహళ్ళిలో సీఎం కుమారస్వామి, ఆయన సతీమణి అనితా కుమారస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తల్లిదండ్రుల వెంట మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి ఉన్నారు.

తెలుగు ఓటర్ల హవా: ఖార్గేకి మద్దతుగా ప్రియాంక గాంధీ, లేడీ సూపర్ స్టార్ ప్రచారం, మోడీకి పోటీగా!తెలుగు ఓటర్ల హవా: ఖార్గేకి మద్దతుగా ప్రియాంక గాంధీ, లేడీ సూపర్ స్టార్ ప్రచారం, మోడీకి పోటీగా!

Karnataka CM HD Kumaraswamy cast their vote in Bangalore rural constituency

గత శాసన సభ ఎన్నికల్లో హెచ్.డి. కుమారస్వామి రామనగర, చెన్నపట్టణ నియోజక వర్గాల (రెండు నియోజక వర్గాలు) నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో కుమారస్వామి బిడిది నియోజక వర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.తరువాత కుమారస్వామి రామనగర నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎన్నికల్లో సీఎం కుమరస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామికి పోటీగా స్వతంత్ర పార్టీ అభ్యర్థి, బహుబాష నటి సుమలత పోటీ చేస్తున్నారు. మండ్యలో బీజేపీ అభ్యర్థిని పోటీకి దింపని ఆ పార్టీ నాయకులు సుమలతకు మద్దతు ఇస్తున్నారు. బీజేపీతో పాటు కర్ణాటక రైతు సంఘం సైతం సుమలతకు మద్దతు ప్రకటించాయి. మండ్యలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంది.

English summary
Karnataka Chief minister HD Kumaraswamy and Anitha Kumaraswamy cast their vote in Bangalore rural constituency. They are not going to cast their vote to their son because they don't have voting right in Mandya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X