వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ మీద స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సీఎం, ఎమ్మెల్యేలకు గాలం, ఆపరేషన్ కమల, రూ. కోట్లు ఇస్తామని!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆపరేషన్ కమల పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. ఆపరేషన్ కమల పేరుతో బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలకు రూ. కోట్టు ఇస్తామంటున్నారని సీఎం కుమారస్వామి ఆరోపించారు.

బీజేపీ నాయకుల కథ ఏమి !

బీజేపీ నాయకుల కథ ఏమి !

ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీ నాయకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ రమేష్ కుమార్ కు మనవి చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మాట్లాడినట్లు ఉన్న ఆడియో టేపులను విడుదల చేసిన ముఖ్యమంత్రి కుమారస్వామి వెంటనే స్పీకర్ రమేష్ కుమార్ కు లేఖ రాసి బీజేపీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.

ఎమ్మెల్యేలకు గౌరవం

ఎమ్మెల్యేలకు గౌరవం

కర్ణాటకలోని శాసన సభ్యులు అందర్నీ తాము గౌరవించి అభిమానంతో చూసుకుంటున్నామని, అయితే బీజేపీ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆపరేషన్ కమల పేరుతో గాలం వేస్తున్నారని, రూ. కోట్ట రూపాయలు ఇస్తామని ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ కు తన లేఖలో ఫిర్యాదు చేశారు.

గెస్ట్ హౌస్ లో మీటింగ్ !

గెస్ట్ హౌస్ లో మీటింగ్ !

ఫిబ్రవరి 7వ తేదీ గురువారం తమ పార్టీ ఎమ్మెల్యే (జేడీఎస్) నాగనగౌడ కందెకూరు కుమారుడు శరణగౌడకు ఫోన్ చేసిన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవదుర్గలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ కు రావాలని ఆహ్వానించారని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే రాజీనామా !

ఎమ్మెల్యే రాజీనామా !

మీ తండ్రి నాగనగౌడతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని ఆయన కుమారుడు శరణగౌడను రెచ్చగొట్టారని, రాజీనామా చేస్తే మీరు అడిగినంత డబ్బులు ఇస్తామని మభ్యపెట్టారని సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఆ సందర్బంలో ప్రతిపక్ష నాయకుడు బీఎస్. యడ్యూరప్పతో పాటు దేవదుర్గ శాసన సభ్యుడు శివనగౌడ నాయక్ తనకు వ్యతిరేకంగా మాట్లాడని మాటలు మాట్లాడని, వారి మీద చర్యలు తీసుకోవాలని సీఎం కుమారస్వామి స్పీకర్ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

హాసన్ ఎమ్మెల్యే గౌడ

హాసన్ ఎమ్మెల్యే గౌడ

అదే సమయంలో హాసన్ శాసన సభ్యుడు ప్రీతం గౌడ హాజరైనారని, ఆయన మాటలు వ్యక్తిగతం తనను భాదపెట్టాయని, ఒక శాసన సభ్యుడు స్పీకర్ కు వ్యతిరేకంగా ఇలా మాట్లాడటం మంచిది కాదని, శాసన సభ నియమాల ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాలని సీఎం కుమారస్వామి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

English summary
Karnataka Chief Minister H.D.Kumaraswamy complaint to assembly speaker K.R. Ramesh Kumar about operation kamala. In a letter he requested to take action on BJP MLA's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X