బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను మళ్లీ సీఎం అవుతా, సిద్దూ, సంతోషం సీఎం కుమార, దెబ్బకు దెబ్బ: అలజడి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఏమి జరిగినా సంతోషమే, జరిగేది ఎవ్వరూ ఆపడానికి సాధ్యం కాదుకదా ? ఇది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్యను ఉద్దేశించి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు. సిద్దరామయ్య మళ్లీ సీఎం అయితే సంతోషం అంటూ కుమారస్వామి దెబ్బకు దెబ్బగా కౌంటర్ ఇవ్వడంతో సంకీర్ణ ప్రభుత్వంలో అలజడి మొదలైయ్యింది.

నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతాను అని సిద్దరామయ్య మీడియాతో అన్నారు. ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి, కుమారస్వామిని మీడియా ప్రశ్నించగా సంతోషం, ఆయన సీఎం అయితే తాను సంతోషిస్తానని కుమారస్వామి ముఖం తిప్పుకున్నారు.

ఆగస్టు 24వ తేదీ శుక్రవారం హాసన్ జిల్లాలోని హళేనరసీపుర తాలుకాలోని హాడ్య గ్రాయంలో దేవాలయం ప్రారంభం సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడారు. ఐదు సంవత్సరాలు నిరంతరంగా తాను సీఎం పదవిలో ప్రజలకు సేవ చేశానని సిద్దరామయ్య అన్నారు.

Karnataka CM Kumaraswamys reaction to Siddaramaiahs statement becoming CM again.

కులా మతాలకు అతీతంగా తాను ఐదు సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టానని సిద్దరామయ్య అన్నారు. అయితే కొన్ని శక్తుల కుట్ర వలన తాను మళ్లీ ముఖ్యమంత్రిని కాలేకపోయానని, అయితే ప్రజల ఆశీర్వాదం తనకు ఉందని సిద్దరాయయ్య చెప్పారు.

ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తనను ఎలాంటి శక్తులు అడ్డుకోలేవని, తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. బాదామి శాసన సభ్యుడు అయిన సిద్దరామయ్య వ్యాఖ్యలు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదుపేసింది. సిద్దరామయ్య వ్యాఖ్యలతో సంకీర్ణ ప్రభుత్వంలో అలజడి మొదలైయ్యింది.

English summary
If he wants to become CM, he can. i will be happy' this is Karnataka Chief minister HD Kumaraswamy's reaction to EX CM Siddaramaiah's statement. Speaking in function at Hassan, Siddaramaiah has told that, 'He will become Karnataka's CM again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X