వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిల్లాకు లక్ష ఉద్యోగాలు, పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు, బళ్లారి, కోప్పాల నుంచి శ్రీకారం, సీఎం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ఎంపిక చేసిన 9 జిల్లాల్లో వైవిద్యానికి అనుగుణంగా పరిశ్రమల క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాలో లక్ష ఉద్యోగులు సృష్టించాలని గురి పెట్టుకున్నామని, అందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు.

ప్రతి జిల్లా కోసం

ప్రతి జిల్లా కోసం

బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్ లో సోమవారం ఏర్పాటు చేసిన బళ్లారి చేనేత క్లస్టర్, కోప్పళ టాయ్స్ క్లస్టర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి హెచ్ డి. కుమారస్వామి ప్రారంభించారు. కర్ణాటక వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు.

 టార్టెట్ అంటున్న సీఎం

టార్టెట్ అంటున్న సీఎం

కర్ణాటక రాష్ట్ర అభివృద్ది 10 శాతం పెరిగిందని సీఎం కుమారస్వామి అన్నారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని సీఎం కుమారస్వామి అన్నారు. అందులో భాగంగా మొదట బళ్లారి, కోప్పల జిల్లాలను ఎంపిక చేసుకున్నామని ముఖ్యమంత్రి కుమారస్వామి వివరించారు.

యువత కోసం

యువత కోసం

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఆర్థికంగా వారిని పైకి తీసుకురావడానికి, మహిళల ఆర్థికంగా అభివృద్ది చెయ్యడానికి క్లస్టర్ల సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి హెచ్ డి. కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయిలో

జాతీయ స్థాయిలో

ఈ పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. బళ్లారి, కోప్పళ, మైసూరు, చిత్రదుర్గ, కలబురిగి తదితర జిల్లాల్లో జాతీయస్థాయిలో చేతివృత్తులను ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాకు రూ. 5 కోట్లు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.

 నిరుద్యోగం అనే పదం !

నిరుద్యోగం అనే పదం !

రాష్ట్రంలో 7,940 కిలోమీటర్ల రోడ్లు- ఫైఓవర్లు అభివృద్ది చెయ్యడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కుమారస్వామి వివరించారు. కర్ణాటకలో నిరుద్యోగం అనే పదం వినపడకుండా చూడటానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని, అది కచ్చితంగా నేరవేర్చుతామని ముఖ్యమంత్రి కుమారస్వామి హామి ఇచ్చారు.

రూ. 1.6 లక్షల పెట్టుబడి

రూ. 1.6 లక్షల పెట్టుబడి

కర్ణాటకలో నిరుద్యోగం అనే మాటను తరిమికోట్టడానికి, యువతకు ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా చూడటానికి సంకీర్ణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. 9 జిల్లాల్లోని పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు రూ. 1.5 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నామని డాక్టర్ జీ. పరమేశ్వర్ వివరించారు.

English summary
CM Kumaraswamy said we will create one lakh jobs in each district by Industry clusters. He inagurated Bellary and Koppal district industry clusters today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X