వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హింది భాష అవసరమా మిత్రమా, కన్నడ, తెలుగు, తమిళ భాషలు, అది ఎలా సాధ్యం అవుంది: సీఎం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: త్రిభాష సూత్రం పేరుతో ఒక్క భాషను బలవంతంగా ప్రజల మీద రుద్దడం మంచిదికాదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభిప్రయం వ్యక్తం చేశారు. తాము రెండు భాషల విషయంలో చర్చించి పూర్తి సమాచారం తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని సీఎం కుమారస్వామి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చెయ్యాలని ప్రయత్నిస్తున్న త్రిభాష సూత్రం విషయంలో సీఎం కుమారస్వామి సోషల్ మీడియాలో స్పందించారు. హింది బాష తప్పనిసరి చెయ్యడాన్ని కన్నడ సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయని సీఎం కుమారస్వామి అన్నారు.

Karnataka CM said one language should not be imposed on others in the name of the three-language formula.

కర్ణాటకలో జీవిస్తున్న హిందీ భాషస్తులు కన్నడ నేర్చుకోవడం సాధ్యం కాదని అంటున్నారు. అలాంటి సందర్బంలో కన్నడిగులు హిందిని నేర్చుకోవడం ఎలా సాధ్యం అవుతందని చాల మంది ప్రశ్నిస్తున్నారని ముఖ్యమంత్రి కుమారస్వామి గుర్తు చేశారు.

హింది భాష మాట్లాడటం, హిందిని చదవడం తప్పుకాదని వాదిస్తున్న వారు ఎయిర్ పోర్టులు రైల్వేష్టేషన్లలో కన్నడ, మరాఠి, తెలుగు, తమిళ, గుజరాతి తదితర భాష పేర్తు రాస్తే తప్పు ఏముందని ఇంత కాలం ఎందుకు మాట్లాడలేదని సీఎం కుమారస్వామి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

దక్షిణ భారతదేశ ప్రజల మీద బలవంతంగా హింది భాషను తప్పనిసరి చెయ్యలాని ప్రయత్నించడం ఎంత వరకు సబబు అని సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. హింది భాష లేకుండా దక్షిణ భారత ప్రజలు ప్రగతి సాదిస్తున్నారని, ఇలాంటి సమయంలో హింది భాషను తప్పనిసరి చెయ్యడం ఏమిటని సీఎం కుమారస్వామి నిలదీస్తున్నారు.

English summary
Joining the chorus against a proposal for teaching Hindi in non-Hindi speaking states, Karnataka Chief Minister H D Kumaraswamy Sunday said one language should not be imposed on others in the name of the three-language formula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X