• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

45 ఏళ్లలో ఎన్నడూ ఇంతలా వర్షం కురవలేదు : కర్ణాటక సీఎం యడియూరప్ప

|

బెంగళూరు : దక్షిణ భారతదేశంలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఆకాశానికి గండి పడిందా అనే రేంజ్‌లో వానలు పడుతున్నాయి. దీంతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతున్నాయి. కొండచరియలు పడి కేరళలో పదుల సంఖ్యలో చనిపోగా .. కర్ణాటకలో మిగతా రాష్ట్రాల్లో కలిపి మృతుల సంఖ్య 85కి చేరింది.

ఉపాధి పేరుతో వంచన : ఆదివాసీ మహిళను మధ్యప్రదేశ్‌లో విక్రయించిన కానిస్టేబుల్, కేసు నమోదు

కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 85 మంది చనిపోయినట్టు అధికారలుు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 5 వేల 375 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వీరికి ఆర్మీ, నేవీ కూడా సహకారం అందిస్తోంది. కేరళ, కర్ణాటకలో ఇప్పటికే 42 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. ప్రస్తుతం గోవా, ఒడిశాలో మాత్రం పరిస్థితి సానుకూలంగా ఉంది.

Karnataka CM says worst tragedy in 45 years

కర్ణాటకలో భారీ వర్షం పడుతోంది. ప్రజలే కాదు మూగ జీవాలు కూడా అల్లాడిపోతున్నయి. శిమొగ్గలో 200 పశువులను అధికారులు కాపాడారు. మరోవైపు ఇళ్లు, కార్యాలయాల్లోకి వర్షపునీరు చేరింది. కర్ణాటకలో వరుణుడి ప్రతాపంపై ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప స్పందించారు. గత 45 ఏళ్లలో ఇంతటి వర్షాలను ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది జాతీయ విపత్తు అని పేర్కొన్నారు. కర్ణాటకలో ఇప్పటికే రూ.6 వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేశారు. గుజరాత్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షపునీరుతో వడోదరలో మొసళ్లు వీధుల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత వీటిని చూసి భయబ్రాంతుకుల గురైన జనం .. తర్వాత వాటితో ఆడుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ఓ వ్యక్తి మొసళిపై తాడుబొంత వేసి .. దానిని పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చిన వీడియో తెగ ట్రెండ్ అయ్యింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Incessant rains are wreaking havoc in at least nine states killing over 80 people and displacing lakhs. At least 5,375 NDRF personnel have been pressed into rescue and relief operations across India as states face the fury of floods and landslides. States have also sought the help of Army, Navy, Air Force as well as teams of local police and SDRF for the rescue efforts. NDRF has rescued over 42,000 people in Kerala, Karnataka, Maharashtra, Andhra Pradesh, Madhya Pradesh and Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more