RTC: మహిళల ఉచిత బస్ పథకం రద్దుపై క్లారిటీ ఇచ్చిన సీఎం..!
కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు హామీ ఇచ్చింది. కర్ణాటక, తెలంగాణలో ఈ హామీ ఇచ్చింది. కర్ణాటకలో అధికారంలోకి రాగానే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకుంది. దాని పేరు శక్తిగా పెట్టారు. దీంతో అక్కడి ఆర్టీసీలో మహిళ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ఎత్తివేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ శక్తి పథకం వల్ల కర్ణాటక ఆర్టీసీ నష్టాలు పెరుగుతోన్నాయని తెలిసింది.
ఆర్టీసీ అప్పుల బాదాలు తీరాలంటే శక్తి పథకాన్ని రద్దు చేయాలని సిద్ధరామయ్య యోచిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందించాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనిపై అసత్యాలను ప్రచారం చేయవద్దని కోరారు. ఈ పథకాన్ని రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. అయితే కొందరు మహిళలు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్ కొంత మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.

దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో శక్తి పథకం రద్దు అవుతుందంటూ ప్రచారం మొదలైంది. 2023, జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే అంటే గతేడాది డిసెంబర్ లో ఉచిత బస్ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్ కొనసాగుతోంది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇక సిటీ బస్సుల్లో అయితే ఆర్డీనరి, మెట్రో ఎక్స్ ప్రెస్ లో ఉచిత ప్రయాణం చేయవచ్చు.
అయితే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం వల్ల సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది మహిళలు తమకు పని ఉన్నా లేకపోయిన బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. దీంతో మిగతా వారు బస్సుల్లో సీట్లు లేక అవస్థలు పడుతున్నారు. ఫ్రీ కాకుండా రాయితీ పై మహిళలకు బస్సు ప్రయాణం కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు.












Click it and Unblock the Notifications