వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత పార్టీ లీడర్స్ కుట్ర: సీఎం ఆడియో లీక్ చేసింది ఎవరంటే, సెల్ఫ్ గోల్, కింగ్ పిన్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మాట్లాడారు అంటున్న ఆడియో టేప్ లీక్ వ్యవహారం ఇప్పుడు బీజేపీ వర్గాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ వ్యవహారంలో నేడు (మంగళవారం) సుప్రీం కోర్టులో సీఎం యడియూరప్ప ఆడియో టేప్ లీక్ వ్యవహారంపై విచారణ జరగనుంది. సీఎం యడియూరప్ప ఆడియో లీక్ కావడంతో అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. సొంత పార్టీ నేతల కుట్ర వలనే సీఎం ఆడియో టేప్ లీక్ అయ్యిందని, దెబ్బకు దెబ్బ పడింది అని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది!భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది!

 ఇంటి దొంగలు!

ఇంటి దొంగలు!

సీఎం యడియూరప్ప మాట్లాడిన ఆడియో టేప్ ను ఎవరు లీక్ చేశారు ? అనే విషయంపై కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ మాట్లాడుతూ బీజేపీ నాయకులే ఈ ఆడియో లీక్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యడియూరప్పతో పాటు బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న నాయకులే ఆయన మాట్లాడిన సమయంలో రికార్డు చేసిన మాటల ఆడియోను లీక్ చేశారని కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దినేష్ గుండూరావ్ ఆరోపించారు.

అమిత్ షా కింగ్ పిన్?

అమిత్ షా కింగ్ పిన్?

హుబ్బళ్ళిలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రావడానికి మరో పార్టీని అధికారం నుంచి దూరం చెయ్యడానికి (కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం) కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా భాద్యతలు తీసుకున్నారని, అందుకే మనం (బీజేపీ) అధికారంలోకి వచ్చామని సీఎం యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆడియో రికార్డు అయ్యింది. ఈ ఆడియో ఫ్రూప్ ను స్వయంగా బీజేపీ నాయకులే విడుదల చేశారని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం అంటే గిట్టని లీడర్స్!

సీఎం అంటే గిట్టని లీడర్స్!

సీఎం యడియూరప్ప అంటే గిట్టనని బీజేపీ నాయకులే ఈ ఆడియో టేప్ రికార్డు లీక్ చేసే భాద్యతను స్వీకరించారని దినేష్ గుండూరావ్ ఆరోపించారు. అనర్హత ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని బీజేపీలో డిమాండ్ చేస్తున్న వారు ఎక్కువ అయ్యారని, అందులో భాగంగానే సీఎం యడియూరప్పను సొంత పార్టీ నాయకులే టార్గెట్ చేసి ఈ ఆడియో టేప్ లీక్ చేశారని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ ఆరోపించారు.

ఆడియో లీక్ చేసిన బీజేపీ అధ్యక్షుడు!

ఆడియో లీక్ చేసిన బీజేపీ అధ్యక్షుడు!

యడియూరప్పను సీఎం కుర్చి నుంచి కిందకు దించడానికి పెద్ద స్కెచ్ వేశారని దినేష్ గుండూరావ్ ఆరోపించారు. తన ఊహ ప్రకారం బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ అండ్ టీం సీఎం యడియూరప్ప మాట్లాడిన ఆడియో టేప్ లీక్ చేసి ఉంటారని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓకే ఒక్కడు కటీల్!

ఓకే ఒక్కడు కటీల్!

హుబ్బళ్ళిలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆ సమావేశానికి హాజరైన బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ కు తప్పా వేరే వ్యక్తులు ఆడియో రికార్డు చేసి విడుదల చేస అవకాశం లేదని, సొంత పార్టీ నాయకులే సీఎం యడియూరప్ప మీద కుట్రకు పాల్పడ్డారని, ఇది వారి సొంత వ్యవహారం అని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ అన్నారు.

సిద్దరామయ్య ఝలక్!

సిద్దరామయ్య ఝలక్!

సీఎం యడియూరప్ప బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆడియో లీక్ కావడానికి సిద్దరామయ్య కారణం అని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై మాజీ సీఎం సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. సీఎం యడియూరప్ప మీద బీజేపీలోనే సొంత పార్టీ శత్రువులు ఎక్కువ అయ్యారని, వారే ఆడియో లీక్ చేసి ఉంటారని, అనవసరంగా మా మీద నిందలు వేస్తున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య మండిపడుతున్నారు.

English summary
Karnataka CM Yediyurappa Audio Tape Leak: KPCC President Dinesh Gundu Rao Statement In Belagavi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X