వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏక్ దేశ్ మే దో ప్రధాన్ నహీ చలేగా: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరింది, కర్ణాటక సీఎం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆర్టికల్ 370 రద్దు పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సంతోషయం వ్యక్తం చేశారు. ఏక్ దేశ్ మే దో ప్రధాన్ నహి చలేగా అని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెప్పిన మాటను సీఎం యడియూరప్ప గుర్తు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కాశ్వీర్ విభజన విషయంలో స్పందించారు. భారతదేశంలో స్వాతంత్రం తరువాత తీసుకున్న మహత్వ నిర్ణయం కాశ్మీర్ విభజన అని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.

బెంగళూరు: ఆర్టికల్ 370 రద్దు పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సంతోషయం వ్యక్తం చేశారు. ఏక్ దేశ్ మే దో ప్రధాన్ నహి చలేగా అని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెప్పిన మాటను సీఎం యడియూరప్ప గుర్తు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కాశ్వీర్ విభజన విషయంలో స్పందించారు. భారతదేశంలో స్వాతంత్రం తరువాత తీసుకున్న మహత్వ నిర్ణయం కాశ్మీర్ విభజన అని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశం కోసం జైలుకు

దేశం కోసం జైలుకు

కాశ్మీర్ కు కట్టబెట్టిన ప్రత్యేక హక్కులను వ్యతిరేకిస్తూ 1953లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్ సంఘ్ ను స్థాపించి పోరాటం చేశారని యడియూరప్ప గుర్తు చేశారు. కాశ్మీర్ అధికరణ 370ని వ్యతిరేకించి పోరాటం చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని అరెస్టు చేసి నెల రోజులకు పైగా జైల్లో పెట్టారని ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు.

ఏక్ దేశ్ మే దో ప్రధాన్ !

ఏక్ దేశ్ మే దో ప్రధాన్ !

ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో నిశాన్, దో విధాన్ నహి చలేగా అంటూ ఏకంగా తన ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ముఖ్యమంత్రి యడియూరప్ప గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు నేడు శాంతి చిక్కిందని ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు.

వేలాది మంది అమరులు

వేలాది మంది అమరులు

భారత్ లో కాశ్మీర్ పూర్తిగా భాగం కావాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో సహ వేలాది మంది అమరులు అయ్యారని, వారి కల నేడు నెరవేరిందని ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో దేశం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తోందని ముఖ్యమంత్రి యడియూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రపంచం ముందు తల ఎత్తుకుని !

ప్రపంచం ముందు తల ఎత్తుకుని !

ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో భారత్ నేడు ప్రపంచదేశాల ముందు తలఎత్తుకుని నిలబడిందని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. కాశ్మీర్ ప్రజలు సైతం ఆర్టికల్ 370 రద్దు చెయ్యడాన్ని స్వాగతిస్తున్నారని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏడు దశాబ్ధాల కల

ఏడు దశాబ్ధాల కల

ఏడు దశాబ్ధాల భారత్ ప్రజల, కాశ్మీర్ ప్రజల డిమాండ్ నేడు నెరవేరిందని ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. కాశ్మీర్ లో ఇంత కాలం కొందరు అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారని, ఇక ముందు అలా జరగదని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. మొత్తం మీద ఆర్టికల్ 370 రద్దుతో దేశంలో పండగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
Karnataka CM Yediyurappa described it a historical decision taken by Modi. He talked about scraping article 370
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X