వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటికే మద్యం సప్లై.. మంత్రి వ్యాఖ్యలపై సీఎం ఫైర్..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : మంత్రి హోదాలో ఆయన మాట్లాడిన తీరు వివాదస్పదమైంది. ఇంటికే మద్యం సప్లై చేస్తామంటూ ఆయన చేసిన ప్రకటన కేబినెట్‌లో కలకలం స‌ృష్టించింది. ప్రజల సౌకర్యం కోసం అంటూ సదరు మంత్రి చేసిన ప్రకటన సొంత పార్టీలో కుంపటి పెట్టినట్లైంది. ఇక ఇదే విషయంపై విపక్ష నేతలు నోరు విప్పితే దుమ్ము దుమారమే అన్నట్లుగా కనిపిస్తోంది తాజా యవ్వారం.

కర్ణాటక మంత్రి వర్గంలో అప్పుడు చిచ్చు మొదలైందా అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. వరదలతో రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్థంగా మారిన వేళ ఎక్సైజ్ శాఖ మంత్రి నగేశ్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ప్రజల సౌకర్యార్థం మద్యం డోర్ డెలివరీ చేస్తామని ఆయన చేసిన ప్రకటన వివాదస్పదం అవుతోంది.

అక్కడేమో స్టార్.. ఇక్కడేమో దొంగతనాలు..!అక్కడేమో స్టార్.. ఇక్కడేమో దొంగతనాలు..!

karnataka cm yediyurappa fires on minister for liquor door delivery

మంత్రి నగేశ్ తాజా ప్రకటన సీఎం యడియూరప్పకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆయనకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఎవరిని అడిగి మద్యం డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించారని మండిపడినట్లు సమాచారం. అంతా మీ ఇష్టమేనా అని నిలదీసినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు మీ ఇష్టారాజ్యంగా ఎలా ప్రకటిస్తారంటూ సీరియస్ అయ్యారట.

మంత్రి నగేశ్ వ్యాఖ్యలపై సీఎం యడియూరప్ప అలా స్పందిస్తే.. ఇక విపక్ష నేతలు ఎలా ఫైరవుతారో మరి. ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ఇంటింటికే మద్యం సప్లై చేస్తామనే మంత్రి ప్రకటనను ప్రతి పక్ష నేతలు సీరియస్‌గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనేది చర్చానీయాంశంగా మారింది.

English summary
Karnataka CM Yediyurappa Fires on Excise minister Nagesh and sought an explanation from him. CM questioned and suggested to Minister Nagesh that Who asked you to propose such ideas, You cant say whatever you feel like. Karnataka is facing flood situation and your statement will invite fresh controversy, Yediyurappa serioused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X