వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్ : ఎన్నికల వేళ వివాహం.. ఓటర్ ఐడీ తరహా ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : ఇటీవల వెడ్డింగ్ కార్డులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మొన్నటివరకు మోడీ మళ్లీ ప్రధాని కావాలని.. దానికోసం బీజేపీకి ఓటేయ్యాలనే కాన్సెప్టుతో.. ఎలాంటి కానుకలు వద్దంటూ పెళ్లి పత్రికలు దర్శనమిచ్చాయి. తాజాగా ఓటర్లలో చైతన్యం కలిగించేలా రూపొందించిన వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

డాక్టర్‌గా మారిన ఇంజినీర్.. యువతులే టార్గెట్..! డేటింగ్‌ యాప్‌తో బ్లాక్ మెయిల్డాక్టర్‌గా మారిన ఇంజినీర్.. యువతులే టార్గెట్..! డేటింగ్‌ యాప్‌తో బ్లాక్ మెయిల్

 ఓటర్ ఐడీలా వెడ్డింగ్ కార్డు

ఓటర్ ఐడీలా వెడ్డింగ్ కార్డు

కర్ణాటకకు చెందిన సునీల్, అన్నపూర్ణ అనే జంటకు వివాహం నిశ్చయమైంది. అయితే అక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారు వినూత్నంగా ఆలోచించారు. తమ పెళ్లి కార్డు.. ఓటర్లలో చైతన్యం కలిగించేలా ఉండాలని డిసైడయ్యారు. దాంతో ఆహ్వాన పత్రికను ఓటర్ కార్డుగా ముద్రించారు. అందులో వారి పేర్లు, వివాహ సమయం, వెన్యూ తదితర వివరాలన్నీ పొందుపరిచారు.

 ఓటర్లలో చైతన్యం.. బంధుమిత్రుల ప్రశంసలు

ఓటర్లలో చైతన్యం.. బంధుమిత్రుల ప్రశంసలు

లోక్‌సభ ఎన్నికల వేళ ఈ పెళ్లి కార్డు వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రతిఒక్కరూ ఆ జంటను అభినందిస్తున్నారు. తమ వివాహాన్ని సమాజాన్ని జాగృతపరిచేలా ప్లాన్ చేసుకోవడం శభాష్ అంటూ కితాబిస్తున్నారు. ఈనెల 26న వివాహం జరగనుండటంతో బంధుమిత్రులందరికీ ఇవే కార్డులు పంపిస్తున్నారు.

ఓటు హక్కు వినియోగం, దాని ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఇలా డిసైడయినట్లు చెబుతున్నారు. అందులో వివాహ వేడుకకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు చిన్న మేసేజ్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పేర్కొన్నారు.

గుప్తనిధుల పేరిట 10 లక్షలు మాయం.. రాగి, ఇత్తడి నాణాలతో మోసంగుప్తనిధుల పేరిట 10 లక్షలు మాయం.. రాగి, ఇత్తడి నాణాలతో మోసం

అప్పుడు కూడా ఇలాంటి కార్డే..!

అప్పుడు కూడా ఇలాంటి కార్డే..!

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి కార్డు దర్శనమిచ్చింది. రైల్వే ఉద్యోగి, సామాజిక కార్యకర్త సిద్దప్ప తన వివాహ పత్రికను ఇలాగే ఓటర్ ఐడీ కార్డు రూపంలో ముద్రించారు. జ్యోతి అనే యువతిని అతను పెళ్లి చేసుకున్నాడు. అయితే సిద్దప్ప తమ వివాహ పత్రికకు ఎపిక్ కార్డు (ఓటర్ ఐడీ) నెంబర్ మాదిరిగా 'SJMRG27042018' వేయించారు. సిద్దప్ప జ్యోతి మ్యారేజ్ 2018, ఏప్రిల్ 27న అని దానర్థం.

2018, మే 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అదే సమయంలో తన వివాహం ఉండటంతో ఓటర్లలో చైతన్యం కలిగించేలా పెళ్లికార్డును ఇలా ముద్రించారు సిద్దప్ప. అప్పట్లో అది కూడా బాగా వైరలయింది.

English summary
In the view of lok sabha elections 2019, new couple printed their wedding card like voter id. Their intention is everyone has to use vote weapon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X